Sunday, May 11, 2025

ట్రంప్ ఇప్పుడేం చేస్తారు?

- Advertisement -
- Advertisement -

అమెరికా మధ్యవర్తిత్వానికి
ఒప్పుకొని కాల్పుల విరమణ
రాత్రికల్లా ఉల్లంఘించిన
పాకిస్తాన్ కాల్పుల
విరమణపై తొలి ప్రకటన
వెలువడింది అమెరికా
అధ్యక్షుడు ట్రంప్ నుంచే
పాక్ ఉల్లంఘనతో సంక్లిష్టంగా
మారిన పరిస్థితి ట్రంప్
తదుపరి చర్యలపై సర్వత్రా
ఉత్కంఠ

వాషింగ్టన్: భారత్, పాక్‌లు పూర్తిస్థాయి, తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని, ఇందు కు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని అమెరి కా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. స్వ యంగా అగ్రదేశాధినేత సహా ఆయన యంత్రాం గం రాత్రంతా సంప్రదింపులు జరిపి ఇరుదేశాల ను ఏకతాటిపైకి తెచ్చి కాల్పుల విరమణకు కృషి చేస్తే పాక్ దానికి తూట్లు పొడవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. శనివారంనాడు రాత్రి నియంత్రణ రేఖ వెంట పలు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడడంతో పాటు సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్లను ప్ర యోగించడం దేనికి సంకేతం అన్న అనుమానా లు రేకెత్తుతున్నాయి. ట్రంప్ మధ్యవర్తిత్వం త ర్వాత కుదిరిన కాల్పుల విరమణ అవగాహనను ఒకవైపు భారత్ గౌరవించి సంయమనం పాటిస్తుంటే పాక్ మాత్రం దానిని లెక్కచేయలేదన్న వాదన వినిపిస్తోంది. పాక్ వ్యవహారశైలిపై ట్రంప్ ఇప్పుడు ఏ వైఖరి తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది. అంతకుముందు శనివారం సాయంత్రం ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్‌తో పాటు ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు

.‘ అమెరికా మధ్యవర్తిత్వంతో రాత్రంతా సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. తక్షణమే కాల్పుల విరమణ చేపట్టేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. యుద్ధ సమయంలో ఇరు దేశాలు విజ్ఞతతో, తెలివిగా వ్యవహరించాయి. అందుకు ధన్యవాదాలు’ అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. ట్రంప్ ట్వీట్ చేసిన కొద్ది సేపటికే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో కూడా ఇదే తరహా ప్రకటన చేశారు. భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. భారత్, పాక్ ప్రధానులు నరేంద్ర మోడీ, షెహబాజ్ షరీఫ్, భారత విదేశాంగ మంత్రి జైశంకర్, పాక్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అమిర్ మునీర్, ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్, అసీమ్ మాలిక్‌లతో మాట్లాడినట్లు తెలిపారు. తాను, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇందుకు సంబంధించిన చర్చల్లో పాల్గొన్నామని పేర్కొన్నారు. శాంతి పథాన్ని ఎంచుకోడంలో ప్రధానమంత్రులు నరేంద్ర మోడీ, షరీఫ్‌లు ప్రదర్శించిన విజ్ఞత,వివేకం, రాజనీతిజ్ఞతను తాము అభిందిస్తున్నట్లు రుబియో ఆ ప్రకటనలో పేరొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News