Friday, August 1, 2025

25శాతం సుంకాలు

- Advertisement -
- Advertisement -

రష్యాతో లావాదేవీల నేపథ్యంలో అదనంగా పెనాల్టీ విధింపు
భారత్ వైఖరిలో మార్పు లేనందునే నిర్ణయం అత్యధికంగా
సుంకాలు విధిస్తున్న దేశాల్లో ఒకటని అమెరికా అధ్యక్షుడి ధ్వజం
ట్రంప్ నిర్ణయంపై భారత్ తక్షణ సమీక్ష కేంద్రమంత్రులు
జైశంకర్, పీయూష్ గోయల్ భేటీ ఉన్నతాధికారులతో సమీక్ష

భారత్ మాకు మిత్రదేశమే. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో అది కూడా ఒకటి. వాణిజ్యపరంగా ఏ దేశంతో లేని అడ్డంకులు భారత్‌తో ఉన్నాయి. పైగా రష్యా నుంచి భారీగా ఆయుధాలు కొనుగోలు చేయడం, చమురు దిగుమతి చేసుకుంటోంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని యావత్ ప్రపంచం ఖండిస్తున్నా భారత్, చైనా మాత్రం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ కారణంగానే భారత్‌పై 25శాతం సుంకాలు విధించడంతో పాటు పెనాల్టీ కూడా వేస్తున్నాం. ఇది ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుంది

వాషింగ్టన్ : భారత్ తమకు అత్యంత కావల్సిన మిత్రదేశమే. అ యితే అన్ని విషయాలను లెక్కలోకి తీసుకుని భారతదేశంపై ఇ ప్పుడు 25 శాతం సుంకాలను విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు 1వ తేదీ అంటే శుక్రవారం నుంచే ఇవి అన్ని రకాల సరుకులపై పడుతా యి. ఇంతకాలం భారత్‌కు కూడా టారీఫ్‌లపై పిడుగు పాటు వార్తలు వెలువరిస్తూ వస్తున్న ట్రంప్ ఇప్పుడు పిడుగులు కురిపించారు. భారత్, అమెరికా మధ్య త్వరలోనే అత్యంత కీలకమైన వాణిజ్య ఒప్పందం సమగ్ర రీతిలో కుదరనున్న దశలో ఇరుదేశాల మధ్య ప్రచ్ఛన్న వాణిజ్య యుద్ధం తరహాలో ట్రంప్ టారీఫ్ కార్డు వెలువడింది. చాలా కాలంగా ట్రంప్ పరోక్షంగానే భారత్‌కు తీవ్రస్థాయి హెచ్చరికలు వెలువరిస్తూ వస్తున్నారు. అమెరికా వస్తువులపై భారత్ అత్యధిక సుంకాలు విధిస్తోంది. పైగా తాము చెప్పినా పట్టించుకోకుండా రష్యాతో అనేక రకాలుగా క్రయ విక్రయాలకు దిగుతోంది. ఉక్రెయిన్‌తో యుద్ధం సాగిస్తూ వస్తున్న రష్యా నుంచి అత్యధిక స్థాయిలో చమురు దిగుమతి చే సుకొంటోంది. ఇప్పటివరకూ భారత్‌పై తమ సుంకాలు తక్కువగానే ఉన్నాయి.

ఇప్పుడు పరిస్థితిని సమీక్షించుకుని పాతిక శా తం సుంకాల విధింపులకు దిగాల్సి వస్తోందని ఆయన తమ ట్రూ త్ సోషల్ వేదికగా తెలిపారు. ఈ పెంచిన సుంకాలతో పాటు పెనాల్టీ కూడా ఉంటుందని వెల్లడించారు. ఈ జరిమానాలు రష్యాతో భారత్ సాగిస్తోన్న వ్యాపార లావాదేవీలకు జరిమానా అని ట్రంప్ తెలిపారు. భారత్ నుంచి వచ్చే సరుకులపై అమెరికా ఏ దశలోనూ సుంకాల భారం మోపలేదు. ఇందుకు ప లు కారణాలు ఉన్నాయి. రెండు మూడు నెలలుగా భారత్ తమ వైఖరిని మార్చుకుంటుందని పలు హెచ్చరికలు చేస్తూ వచ్చామని, అయితే పద్ధతిలో మార్పు రాలేదని, ఆగస్టు 1 గడువు విధించామని, ఇక ఇప్పుడు సుంకం విధింపు తప్పితే తమకు మార్గం లేదని ట్రంప్ ప్రకటించారు. భారత్ అత్యంత క్లిష్టమైన , అవాస్తవిక , ద్రవ్యోతర వాణిజ్య అవకతకవలకు పాల్పడుతోందని దీనిని గమనించే పాతిక శాతం సుంకాలకు దిగాల్సి వస్తోందని కూడా చెప్పారు. ఇండియా భారీ టారీఫ్‌లతో పలకరించే స్నేహితదేశం అని వ్యాఖ్యానించారు.

ఇంతకాలం భరించాల్సి వ చ్చింది. ఇప్పుడు ట్రేడ్‌లో ఉండాల్సిన రీతిలో ఉం టామని , ఆగ స్టు 1 నుంచి చూడండని ట్రంప్ హెచ్చరించారు. భారత్ నుంచి అత్యధిక సుంకాలు ఉన్నందునే తాము ఇంతకాలం తక్కువ స్థాయిలో వాణిజ్యం సాగిస్తోందని విశ్లేషించారు. భారత్ రష్యా తో ప్రత్యేకించి సాగిస్తోన్న సైనిక , రక్షణ భద్రతా వ్యవహారాల లావాదేవీలను తాము గమనిస్తూ వస్తున్నామని , ఉక్రెయిన్‌లో ఊచకోతకు దిగుతున్న రష్యాతో బేరసారాలు వద్దని హెచ్చరింరామని అయితే వినకపోవడం ఇప్పటి తమ చర్యకు దారితీసిందని ట్రంప్ వివరించారు. నిజానికి ట్రంప్ ఏప్రిల్‌లోనే భారత్‌పై 26 శాతం సుంకాల విధింపు చర్యకు దిగారు. అయితే తరువాత ఈ నిర్ణయం అమలు నిలిచిపోయింది. ఇప్పుడు భారత్‌పై భారీ సుం కాల నిర్ణయం తరువాత భారతదేశం వెంటనే దీనిపై సమీక్షించేందుకు సిద్ధం అయింది. విదేశాంగ మంత్రి జైశంకర్, వాణిజ్య మంత్రి పియూష్ గోయల్‌తో సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News