Wednesday, August 20, 2025

6,000 మంది విద్యార్థుల వీసాలు రద్దుచేసిన ట్రంప్

- Advertisement -
- Advertisement -

అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ విద్యార్థులపై మరోసారి కొరడా ఝుళిపించాడు.ఏకంగా ఆరు వేల మంది విద్యార్థుల వీసాలను రద్దు చేశారు. వారిలో చాలా మంది వీసా గడువు దాటినా అమెరికాలో ఉంటున్నవారని, అమెరికా ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘించిన వారు అని పేర్కొంటూ వారి వీసాలను రద్దు చేశారు. టెర్రరిజానికి మద్దతు ఇస్తున్నారనే సాకుతో
మైనారిటీ వర్గాల వారి వీసాలనూ రద్దుచేసినట్లు విదేశాంగ శాఖ అధికారి సోమవారం ప్రకటించారు. అమెరికా ప్రెసిడెంట్ గా రెండో సారి అధికారం చేపట్టిన నాటి నుంచి వలసల నియంత్రణలో భాగంగా విద్యార్థుల వీసాలపై కఠిన వైఖరి అవలంభిస్తున్న ట్రంప్ సోషల్ మీడియా పై నిఘా పెట్టడం, స్క్రీనింగ్ విస్తరించడం వంటి చర్యలకు దిగారు ఇప్పుడు ఏకంగా 6 వేల మంది
విద్యార్థుల వీసాలు రద్దు చేశారు.విదేశాంగ మంత్రిత్వశాఖ ఈ సంవత్సరం విదేశాలలో ఉంటున్న అమెరికా దౌత్యవేత్తలకు ముందే పలు కఠిన మైన నిబంధనలను జారీ చేసింది.

ముఖ్యంగా వీసా దరఖాస్తుదారుల నేరచరిత్ర,రాజకీయ కార్యకలాపాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అమెరికా సందర్శకులలో దాదాపు 4 వేలమంది వీసాలను చట్టాన్ని ఉల్లంఘించారనే సాకుతో రద్దుచేశారు. వారిలో ఎక్కువ మంది దాడులకు సంబంధించినవేనని ఓ అధికారి తెలిపారు. అంతేకాదు, మద్యం, డ్రగ్స్ తీసుకుని వాహనాలు నడిపినవారు, దొంగతనం ఇతర నేరాలకు పాల్పడ్డారనే ముద్రతో కూడా చాలామంది వీసాలు రద్దయ్యాయి.200 నుంచి 300
మందిని ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం, ఉగ్రవాద సంస్థలతో సంబంధం కలిసి ఉన్నారనే ముద్రవేశారు. ఇందుకు విదేశాంగ వ్యవహారాల మాన్యువల్ కింద వీసా అనర్హతకు సంబంధించిన నియమాన్ని అధికారి ఉదహరించారు. అయితే వీసాలు రద్దయిన విద్యార్థులు ఏ గ్రూప్ లకు మద్దతు ఇస్తున్నారో మాత్రం అధికారి చెప్పలేదు. గాజా యుద్ధం, పాలస్తీనియన్ల హక్కులకు మద్దతుగా పెద్దఎత్తున విద్యార్థులు నిరసన తెలిపిన అనేక యూనివర్సిటీలపై ప్రెసిడెంట్ ట్రంప్ కక్ష కట్టారు. అవి యూదు వ్యతిరేక స్థావరాలుగా మారాయని ఆరోపించడమే కాగ, వాటిపై చర్యలకు దిగారు.

హార్వర్డ్ యూనివర్సీటీ రీసర్చ్ కార్యకలాపాలకు నిధులను స్తంభింపజేయడంతో పాటు ఆ యూనివర్సిటీకి ఇస్తున్న పన్ను రాయితీని కూడా రద్దుచేస్తానని హెచ్చరించారు. దీంతో పలు యురోపియన్ దేశాలు ప్రతిభావంతులను ఆకట్టుకునేందుకు రీసర్చ్ కార్యకలాపాలకు ఇచ్చే నిధులను పెంచాయి.అమెరికా విదేశాంగ విధానానికి విరుద్ధమైన కార్యకలాపాల్లో పాల్గొన్నందుకే పలువురు విద్యార్థులతో సహా వందలాది మంది పౌరుల వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. పాలస్తీనియన్లకు మద్దతు ఇవ్వడంతో పాటు, గాజా యుద్ధంలో ఇజ్రాయిల్ ను విమర్శించిన విద్యార్థుల వీసాలనే కాదు, గ్రీన్ కార్డ్ హోల్డర్లను కూడా బహిష్కరించే అవకాశం ఉందని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరిక జారీచేసింది. వారిలో కొందరు హమాస్ మద్దతుదారులుగా పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News