Saturday, July 26, 2025

ఇండియన్స్‌కు జాబ్స్ ఇవ్వొద్దు

- Advertisement -
- Advertisement -

భారత్‌లో నియామకాలను నిలిపి
వేయండి చైనాలో కంపెనీలు
పెట్టడం, ఇండియాలో హైరింగ్
చేయడం ఇకపై కుదరదు గూగుల్,
మైక్రోసాఫ్ట్ తదితర టెక్ కంపెనీలకు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్
ఉద్యోగాల్లో అమెరికన్లకే ప్రాధాన్యం
ఇవ్వాలని ఆదేశం

వాషింగ్టన్ : గూగుల్, మైక్రోసాఫ్ట్, వంటి భారీ టెక్ కంపెనీలు భారతీయులను నియమించుకోవడం ఆపి, అమెరికన్లపై దృష్టి పెట్టాలని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బలమైన సందేశం పం పారు. ఆయన బుధవారం వాషింగ్టన్ డీసీలో జ రిగిన ఏఐ సదస్సులో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య లు చేశారు. టెక్ కంపెనీల గ్లోబలిస్ట్ మైండ్‌సెట్ ను ఆయన విమర్శించారు. చాలా మంది అమెరికన్లు తమను పట్టించుకోవడం లేదన్న భావన లో ఉన్నట్టు పేర్కొన్నారు. దేశంలో లభించిన స్వేచ్ఛను వాడుకొని చాలా టెక్ కంపెనీలు ఇత ర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. తన పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయని చెప్పారు. “ మన దేశం లోని చాలా భారీ టెక్ కంపెనీలు చైనాలో కంపెనీలు నిర్మిస్తూ భారతీ య ఉద్యోగులను నియమించుకుంటూ ఐర్లాండ్‌ను అడ్డం పెట్టుకుని తక్కువ లాభాలు చూపు తూ స్వేచ్ఛను అనుభవించాయి. ఆ విషయం మీకు తెలుసు.

అక్కడి ప్రజల అవకాశాలను ప ట్టించుకోకపోవడం నిర్లక్షం చేయడం వంటివి చేశారు. ట్రంప్ పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయి. ఏఐ రేసులో విజయం సాధించాలంటే సిలికాన్ వ్యాలీలో సరికొత్త దేశ భక్తి అవసరం. ఇక్కడ ఉన్న టెక్నాలజీ కంపెనీలు మొత్తం అమెరికా కోసమే . దేశానికే మొదటి ప్రాధాన్యం ఇస్తూ పనిచేయాలి. మీరూ అది చేయాలి. అదే నేను కోరుతున్నాను. ” అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ సదస్సులో ట్రంప్ మేథకు సంబంధించి మూడు కీలక ఆదేశాలపై సంతకాలు చేశారు. ఏఐకు ఉన్న ఆటంకాలను తొలగించడం, అభివృద్ధిని వేగవంతం చేయడం, ఇక ప్రభుత్వ నిధులు పొందుతున్న సంస్థలు తయారు చేసే ఏఐ టూల్స్ రాజకీయంగా తటస్థ వైఖరితో ఉండేలా చూడటం వంటి అంశాలున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News