Tuesday, July 8, 2025

ట్రంప్ హెచ్చరిక.. బ్రిక్స్ దేశాలపై 10శాతం అదనపు సుంకం

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : భారత్, చైనా, రష్యా, బ్రెజిల్ ఇతర దేశాలతో కూడిన బ్రిక్స్ వేదికపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. బ్రిక్స్ అమెరికా వ్యతిరేకతను ప్రదర్శించింది. దీనిని పరిగణనలోకి తీసుకుంటున్నాం, ఇక బ్రిక్స్ అనుకూల దేశాలన్నింటిపైనా 10 శాతం అదనపు సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా వ్యతిరేకతను ప్రదర్శించే ఏ దేశంతో కలిసి తిరిగే ఏ దేశం అయినా అమెరికా వ్యతిరేక దేశంగానే భావించి తాము తగు కఠిన చర్యలు తీసుకుంటామని ట్రంప్ హెచ్చరించారు. తమ ట్రూత్ సోషల్ మీడియా ద్వారా ట్రంప్ స్పందించారు.

బ్రిక్స్ సంయుక్త తీర్మానం వెలువడిన తక్షణమే ట్రంప్ తీవ్రస్థాయి స్పందన వెలుగులోకి వచ్చింది. బ్రిక్స్‌లో భారతదేశం కూడా ఉండటం, బ్రెజిల్‌లో జరిగిన సదస్సులో ప్రధాని మోడీ ఆలోచనలకు అనుగుణంగానే సంయుక్త తీర్మానం వెలువడటం, అమెరికా సుంకాల జోరును ఇందులో తప్పుపట్టడం జరిగింది. ఈ దశలో అదనపు పది శాతం టారీఫ్‌ల జాబితాలో భారతదేశం కూడా ఉంటుందా? త్వరలో కుదిరే భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం భవిత ఏమిటనేది ఇప్పుడు కీలకం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News