Wednesday, July 2, 2025

ట్రంప్, మస్క్ వార్

- Advertisement -
- Advertisement -

బ్యూటీఫుల్ బిల్లుపై మాటల
యుద్ధం బిల్లు ఆమోదిస్తే
కొత్త పార్టీ పెడతా : మస్క్
సబ్సిడీలు ఉపసంహరిస్తే మస్క్
దుకాణం సర్దుకోవాల్సిందే : ట్రంప్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ల మధ్యఇటీవల విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడానికి శక్తియుక్తు లు అన్నీ వెచ్చించిన మస్క్ ఆయన ఇటీవల తీసుకువచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును తీవ్రంగా వ్య తిరేకించిన విషయం తెలిసిందే. ఈ బిల్లును మొ దటినుంచీ మస్క్ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఈ బిల్లును గనుక ఆమోదిస్తే తాను కొత్త పార్టీ పె ట్టాల్సి వస్తుందంటూ హెచ్చరించారు కూడా. ఈ కారణంగా ఆ ఇద్దరూ ఇప్పుడు బద్ధ శత్రువులు గా మారారు కూడా. ఈ బిల్లును సెనేట్ ఇప్పటికే ఆమోదించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ బిల్లుపై ప్రతినిధుల సభలో చర్చ జరుగుతున్న త రుణంలో మస్క్ మరోసారి బిల్లుపై మండిపడ్డా రు. సామాజిక సంక్షేమ కార్యక్రమాలను తగ్గించి , అమెరికన్ల రుణ భారాన్ని పెంచే ఈ బిల్లుకు మద్దతు ఇచ్చే చట్టసభ ప్రతినిధులను వచ్చే ఏడాది ఎన్నికల్లో పదవీచ్యుతులను చేస్తానని హెచ్చరించారు.

ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే ఆ మరుసటి రోజే తాను కొత్త పార్టీ పెడతానని కూడా మేరకు మస్క్ ఎక్స్‌లో పెట్టిన పోస్టును 26 మిలియన్ల సార్లు వీక్షించారు. మస్క్ హెచ్చరికలపై ట్రంప్ సైతం అంతే ఘాటుగా స్పందించారు. ‘ మానవ చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ పొందలేని రాయితీలను మస్క్ పొందారు. ఆ సబ్సిడీలు గనుక లేకుంటే బహుశా మస్క్ తన దుకాణాన్ని మూసేసుకుని దక్షిణాఫ్రికాలోని తన ఇంటికి తిరిగి వెళ్లాల్సి వస్తుంది. ఇకపై రాకెట్, ఉపగ్రహ ప్రయోగాలు, ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తులు ఉండవు. మన దేశం చాలా సంపదను ఆదా చేసుకుంటుంది. ఈ విషయాన్ని డోజ్ పరిశీలించాలి. చాలా డబ్బు ఆదా అవుతుంది’ అంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ట్రంప్ పోస్టు తర్వాత కొద్ది గంటలకు మస్క్ మరో పోస్టులో ‘ ఇప్పుడే ఆ రాయితీలు కట్ చేయండి’ అంటూ ట్రంప్‌కు సవాలు విసిరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News