Saturday, May 17, 2025

బుమ్రాకు అందుకే కెప్టెన్సీ ఇవ్వకూడదు.. : రవిశాస్త్రి

- Advertisement -
- Advertisement -

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ ముగిసిన తర్వాత టీం ఇండియా.. ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లనుంది. ఈ ప్రతిష్టాత్మక పర్యటనలో ఆతిథ్య జట్టుతో భారత్ ఐదు టెస్టుల్లో తలపడనుంది. అయితే ఈ సిరీస్‌కి ముందే భారత జట్టుకు షాక్ మీద షాక్ తగిలింది. ముందుగా టెస్ట్ క్రికెట్‌కి రిటైర్‌మెంట్ ప్రకటిస్తున్నట్లు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ప్రకటించాడు. ఈ షాక్ నుంచి తేరుకొనే లోపే.. తాను కూడా టెస్ట్‌ల నుంచి రిటైర్ అవుతున్నట్లు కింగ్ విరాట్ కోహ్లీ వెల్లడించాడు. దీంతో ఇప్పుడు ఆ ఇద్దరి స్థానాల్లో జట్టులోకి ఎవరిని తీసుకోవానే ప్రశ్న తలెత్తింది. ముఖ్యంగా రోహిత్ తప్పుకోవడంతో కెప్టెన్సీ (Test Captain) బాధ్యతలు ఎవరికి అప్పగించాలని బిసిసిఐ వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యంగా ఈ రేసులో జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), శుభ్‌మాన్ గిల్‌ల పేర్లు వినిపిస్తున్నాయి.

అయితే బుమ్రాకి కెప్టెన్సీ (Test Captain) అప్పగించడం కరెక్ట్ కాదని టీం ఇండియా మాజీ ఆటగాడు రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. బుమ్రా సతీమణి సంజనా గణేషన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడు.. బుమ్రాకి కెప్టెన్సీ ఇస్తే.. అతనిపై అదనపు భారం పడుతుందని పేర్కొన్నారు. అతని శరీరాన్ని ఎక్కువగా కష్టపెట్టకూదని అన్నారు. తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడిన బుమ్రా (Jasprit Bumrah) కొంతకాలం విరామం తర్వాత ప్రస్తుతం ఐపిఎల్‌లో ఆడుతున్నాడు. అయితే ఐపిఎల్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేస్తే సరిపోతుంది. కానీ, టెస్ట్‌లలో కనీసం 10-15 ఓవర్లు వేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బుమ్రా అటు కెప్టెన్సీ రెండింటిని బ్యాలెన్స్ చేయడం కష్టమని శాస్త్రి తెలిపారు. అలా చేస్తే.. బౌలర్‌గానూ బుమ్రా సేవలు కోల్పో పరిస్థితి వస్తుందని స్పష్టం చేశారు. బుమ్రా బదులు యువకుడైన శుభ్‌మాన్ గిల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని శాస్త్రి అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News