Monday, September 1, 2025

ఉద్యోగుల జీవితాలతో ఆడుకోవద్ధూ.

- Advertisement -
- Advertisement -
  • జేఏసీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్.
  • నల్ల బ్యాడ్జీలతో జిల్లా కేంద్రంలో ఉద్యోగుల నిరసన.

మన తెలంగాణ/ఆసిఫాబాద్: ఉద్యోగుల (Employees) జీవితాలతో చెలగాటమాడొద్దని, పెన్షన్ ఉద్యోగులకు బిక్ష కాదని అది వారి హక్కు అని ఉద్యోగ ఉపాధ్యాయుల సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ జిల్లా అధ్యక్షుడు లింగాల రాజశేఖర్ డిమాండ్ చేశారు. పెన్షన్ విద్రోహ దినాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపి జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ పదవి విరమణాంతరం పెన్షన్ పొందడం ఉద్యోగి హక్కు,అది ప్రభుత్వ దయాధర్మమో, భిక్షనో కాదని భారత సర్వోన్నత న్యాయస్థానము ఇచ్చిన తీర్పును విస్మరించి మన పాలకులు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను అమలు చేస్తున్నాయన్నారు.ప్రపంచ బ్యాంక్ విధానాలను అమలు చేస్తూ ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం సిపియస్ లేదా ఓపియస్ లలో ఏ విధానాన్ని అమలు చేస్తారో ఎంపిక చేసుకొమ్మని కేంద్ర ప్రభుత్వం అవకాశమిచ్చినప్పుడు ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రకటించుకున్న అప్పటి ప్రభుత్వం, ఉద్యోగులతో (Employees) మాటమాత్రంగానైన చర్చించకుండానే సిపియస్ కు మొగ్గుచూపిందని ఆరోపించారు.దేశంలో పశ్చిమ బెంగాల్,త్రిపురలలో పాత పెన్షన్ విధానామే కొనసాగుతుందని గుర్తు చేశారు. త్రిపురలో ప్రభుత్వం సిపియస్ ను అమలు చేయాలని నిర్ణయించిందని తెలిపారు.గతంలో సిపియస్ పై సమీక్ష చేయుటకు సిఎస్ టక్కర్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో కమిటి వేయడం జరిగిందని అన్నారు.సుమారుగా మన రాష్ట్రంలో ఒక లక్ష నలుభై వేల మంది సిపియస్ ఉద్యోగులు,ఉపాధ్యాయులు మరియు వారి కుటుంబాలు సామాజిక భద్రత పట్ల దినదినం ఆందోళన చెందుతూ ప్రశాంతతలేని జీవితాన్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ధర్నాకు జిల్లా వైద్యాధికారి సీతారాం మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు శాంతి కుమారి,ఉమర్ హుస్సేన్,హేమంత్ షిండే, ఊశన్న,ఏటుకూరి శ్రీనివాసరావు,తుకారం,సదాశివ్,ఖమర్ హుస్సేన్,శ్రీపాద,వలి ఖాన్,భాగ్యలక్ష్మి కలెక్టరేట్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Also Read : కరెంట్ షాక్ తో పులిని ఖతం చేసి… చర్మం ఒలిచి… గోళ్లను పీకేసి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News