- Advertisement -
హైదరాబాద్: ఆదివారం కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ భేటీ జరిగింది. కమిటీ ఛైర్మన్ మల్లు రవి అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్‌లో వరుసగా జరుగుతున్న అంతర్గత కలహాలపై చర్చించనున్నారు. మునుగోడు ఎంఎల్ఎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ క్రమ శిక్షణా కమిటీ సీరియస్ గా తీసుకోనుంది. కొండా మురళీ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. ఈ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారనే అంశంపై ఉత్కంఠ. కొండా మురళి గాంధీ భవన్కు చేరుకున్నారు. కమిటీ కంటే ముందే తానేనే వచ్చానని గాంధీ భవన్కు రావొద్దా ఏంటి అని మీడియాను ప్రశ్నించారు. ఇప్పటికే మురళీ పిసిసి క్రమ శిక్షణ కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మురళీ రాతపూర్వకంగా వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.
- Advertisement -