- Advertisement -
ఇంటర్ మీడియట్ పాసైన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. డిగ్రీ ప్రవేశాల కోసం నిర్వహించే దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీస్) నోటిఫికేషన్ నేడు విడుదల చేయనున్నట్లు తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఉన్నత విద్యామండలి చైర్మన్, కన్వీనర్ బాలకృష్ణా రెడ్డి దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ మేరకు గురువారం జరిగిన దోస్త్ కమిటీ సమావేశంలో షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఈ సారి మూడు విడతల్లో సీట్లు భర్తీ చేయనున్నారు. కాగా, తెలంగాణలో ఇంటర్ ఫలితాలు వెలువడి వారం రోజులు గడుస్తున్నా ఇంకా దోస్త్ నోటిఫికేషన్ విడుదల కాకపోవంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే శుక్రవారం దోస్త్ నోటిఫికేషన్ రానున్న విషయం తెలియడంతో కళాశాలల్లో దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులు సిద్ధం అవుతున్నారు.
- Advertisement -