మామూలుగా గుండెకు ఆపరేషన్ అంటేనే భయపడతారు. అలాంటప్పుడు వయసు ఎక్కువగా ఉంటే ఇంకా చాలా భయ పడతారు. అదే అతను ఇంటి పెద్ద అయితే ఇక వారు చాలా భయానికి లోనవుతారు.. మూడు రక్తనాళాలు బ్లాక్ అయ్యి గుండెకు బైపాస్ ఆపరేషన్ ((Double heart operation)) పెద్ద వయసులో చేయాలంటే కష్టం.. అటువంటి సమయంలో అతనికి మరలా అయోర్టిక్ కవటం కూడా చెడిపోయింది దానిని కూడా మార్చాలి అంటే ఒకే సెట్టింగ్ లో రెండు ఆపరేషన్లు చేయాలి.. ఈ కవాటం కూడా కాల్సిఫికేషన్ ఎక్కువగా జరిగి ఆ కాల్షియం అనేది ఎక్కువగా కవాటం యొక్క గోడలలోకి చొచ్చుకొని పోయింది.. ఇలా ఆ కాల్సిఫికేషన్ తీసేటప్పుడు ఒక్కోసారి హార్ట్ బ్లాక్ వస్తుంది. అప్పుడు మరల పేస్ మేకర్ వేయాల్సి వస్తుంది అది మూడవ ఆపరేషన్ అవుతుంది.
Also Read: నో షేక్‌హ్యాండ్.. పాకిస్తాన్ కు భారత్ షాక్(వీడియో)
ఇదంతా ఎన్టీఆర్ వైద్య సేవలో ఆపరేషన్ ఉచితం గా చేయాలి అంటే అది తలకు మించిన భారం.. ప్రభుత్వ ఆసుపత్రిలో చేసిన కానీ కొంచెం లాస్ ఉంటుంది.. ఇంత హైరిస్క్ ఆపరేషన్ ((Double heart operation)) చేయాలి అంటే డాక్టర్లు కూడా తటపటాయించే పరిస్థితి.. మేము కూడా ఈ పేషెంట్ వెళ్ళిపోతే బాగుంటుంది అని అనుకున్నాము.. కానీ బీద పరిస్థితి ఎక్కడికి వెళ్లలేడు.. అలా అని ఆపరేషన్ చేపించుకోకుండా ఉండలేడు..
కర్నూలులోని లక్ష్మీపురం గ్రామం కు చెందిన హుస్సేన్ పీరా అనే 66 ఏళ్ల వయస్సులో ఉన్న వ్యక్తికి ఈ సమస్య వచ్చింది.. ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూల్ సిటి విఎస్ విభాగం నందు ఈ పేషెంట్ కు వారం కింద సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేయడం జరిగింది.. కాలు నుంచి రక్తనాళాలు తీసి బైపాస్ చేయడమే కాకుండా అయోర్టిక్ కవాటాన్ని కూడా మార్చడం జరిగింది.. ఆపరేషన్ సమయంలో కాల్షియం ఎక్కువగా గోడల లోకి పోవడం వల్ల కొంచెం కష్టమైనా కానీ పేస్ మేకర్ వేసే పరిస్థితి రాలేదు.. పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ లో చాలా కష్టంగా గడిచింది..
కానీ ఆ పేషెంట్ బాగా కోలుకున్నాడు ఈ రోజు డిశ్చార్జ్ కు వచ్చాడు.. అతని వాల్వు అనగా మనము మార్చిన ప్లాస్టిక్ కవాటం కూడా బాగా పనిచేస్తూ ఉంది. బైపాస్ కూడా బాగా సక్సెస్ ఫుల్ గా పనిచేస్తుంది.. అతను రక్తం పలుచబడడానికి కావలసిన యాంటీబయాటిక్స్ మందులు మిగతా మెడిసిన్స్ జీవితాంతం వాడాల్సిన అవసరం ఉంటుంది.. అవి ప్రభుత్వం ఉచితంగా మన ఆసుపత్రిలోనే ఇస్తుంది. ఇది క్లిష్టమైన ఆపరేషన్ అయినా కానీ అనుభవం ఉన్న వైద్యుల చేతిలో సక్సెస్ఫుల్గా చేయవచ్చు.. వయసు అనేది పెద్ద క్రైటీరియా కాదు ఎవరికైనా చేయొచ్చు..
ఎన్టీఆర్ వైద్య సేవలో ఈ ఆపరేషన్ ఉచితం చేయడమే కాకుండా అతనికి మందులు కూడా ఉచితంగా వస్తాయి.. చాలామంది ప్రైవేట్ ఆస్పత్రిలు ఉన్నాయి కదా ఇక గవర్నమెంట్ ఆసుపత్రిలు ఎందుకు అని అనుకుంటూ ఉంటారు.. ఎక్కడైనా ఎన్టీఆర్ వైద్య సేవ వర్తిస్తుంది కదా అనే అభిప్రాయంలో ఉంటారు. కానీ ఇలాంటి కాంప్లికేట్ అయిన ఆపరేషన్లు ఖర్చుతో కూడుకున్న ఆపరేషన్ లో లాస్ వస్తాయి అనుకున్న ఆపరేషన్ ప్రైవేట్ లో చేయరు.. లేదా కొంచెం పేమెంట్ కట్టమని అడుగుతారు.
అటువంటివి కూడా కట్టలేని వారికోసం ప్రభుత్వాసుపత్రిలు ఉండాలి. అటువంటి వారికి అయినా చేసేకి గవర్నమెంట్ ఆసుపత్రులు కూడా ఉండాలి. అప్పుడే ప్రజలకు మంచి సౌకర్యం కలుగుతుంది. 90% ప్రైవేట్ ఆసుపత్రులకే వెళుతూ ఉంటారు ఇప్పుడు కార్పొరేట్ కల్చర్ ఎక్కువగా ఉంది.. దానిని మనము నివారించలేం ఎందుకంటే అది ఒక సోషియల్ ప్రాబ్లం.. ప్రజలందరికీ కేవలం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందించలేవు కూడా…ప్రభుత్వ ఆసుపత్రిలు ప్రైవేటు ఆసుపత్రిలు కలిసి కట్టగా పనిచేస్తేనే ప్రజలకు మంచి ఆరోగ్యం అందుబాటులోకి వస్తుంది..
డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్
గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు
ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు