Friday, May 23, 2025

ఐఈడి పేలి డిఆర్‌జి జవాను మృతి

- Advertisement -
- Advertisement -

నక్సలైట్లు ఏర్పాటుచేసిన మందుపాతర (ఐఈడి) పేలడంతో ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాకు చెందిన జిల్లా రిజర్వ్ గార్డ్(డిఆర్‌జి) చనిపోయాడని అధికారులు తెలిపారు. అభుజ్‌మడ్ ప్రాంతంలోని దట్టమైన అడవుల్లో ఈ ఘటన బుధవారం సాయంత్రం జరిగిది. భద్రతా సిబ్బంది మావోయిస్టులపై పెద్ద ఎత్తున ఎదురు కాల్పులు జరిపి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఎదురుకాల్పుల్లో సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి నంబల కేశవ్ రావు అలియాస్ బసవరాజు(70) సహా 27 మంది నక్సలైట్లు చనిపోయారు. నారాయణ్‌పూర్, బీజాపూర్ జిల్లాల సరిహద్దులోని అడవుల్లో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.

కాగా భద్రతా సిబ్బంది తిరిగి వస్తున్నప్పుడు బీజాపూర్ డిఆర్‌జికి చెందిన రమేశ్ హేమ్లా అనే జవాను ఐఈడిపై కాలుపెట్టడంతో అది పేలి అక్కడికక్కడే చనిపోయాడని పోలీస్ అధికారి తెలిపారు. ఖోత్లురం కొర్రమ్ అనే మరో డిఆర్‌జి సభ్యుడు కూడా బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు నారాయణపూర్‌లోని పోలీస్ లైన్స్‌లో మరణించిన ఇద్దరు జావాన్లకు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించాక, వారి మృత దేహాలను వారి స్వస్థలాలకు పంపుతామని పోలీస్ అధికారి వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News