Thursday, May 1, 2025

శీతల పానీయాలతో ఆరోగ్యానికి చేటు

- Advertisement -
- Advertisement -

పిల్లల నుంచి పెద్దవారి వరకు కూల్ డ్రింక్స్ ఎంతో ఇష్టపడి తాగుతూ ఉంటారు.నిజానికి ప్రతి రోజు కూల్ డ్రింక్స్ తాగేవారు కూడా ఉంటారు.ఇలా తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.వేసవికాలంలో చల్లదనం కోసం వీటిని మరింతగా తాగుతారు.ఇందులో ఉండే రసాయనాలు ఎముకల సమస్యలతో పాటు ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులకు దారీ తీస్తుంది.స్నేహితుల్తో టైమ్ పాస్ కోసం, తిన్నది అరిగించుకోవ్డం కోసం, చాలా మంది కూల్ డ్రింక్స్ తాగుతుంటారు.కొందరికి సందర్భం ఏదైనా చల్లగా ఒక డ్రింక్ కడుపులో పడితే ఆ హాయే వేరు. కానీ, శీత్ల పానీయే కదా అని అదే పనిగా తాగితే కొంప మునిగి. శీతల పానీయాలను ఎక్కువగా తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వ్యాపిస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.చూడ్డానికి రకరకాల రంగుల్లో,చల్లగా ఉంటాయి కూల్ డ్రింక్స్.

ఇటీవ్ల కాలంలో వీటిని తాగే వారి సంఖ్య విప్రీతంగా పెరిగింది.స్నేహితులను కలిసినప్పుడు, రెస్టారెంట్‌కు వెళ్లిన్పు్పడు ఇలా సంద్భ్రం ఏదైనా కూల్ డ్రింక్స్‌ను తాగుతున్నారు. వేసవి వ్స్తే ఇంకా ఎక్కువగా శీతల పానీయాలు సేవిస్తున్నారు.కానీ కూల్‌డ్రింక్స్‌ను అదే ప్నిగా తాగ్డం వ్ల్ల లేనిపోని రోగాల్ని కొని తెచ్చుకున్న్టే్ల అని వైద్యులు చెబుతున్నారు.అతిగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల దీర్ఘ్కాలిక వ్యాధులు వ్స్తాయ్ని హెచ్చ్రిస్తున్నారు.కూల్ డ్రింక్స్ తాగడం వలన పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువ శాతం సైడ్ ఎఫెకట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లివర్ క్యాన్సర్‌తో పాటు ప్రెగ్నెన్సీ , గుండెపోటు ఇలాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఈ శీతల పానీయాలు తాగడం వలన మహిళల్లో ఫ్రై బ్రోస్ , ఫిరోసిస్ వంటి కాలేయంలో మంట వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి ప్రమాదానికి దారితీస్తుంది.

సాధార్ణంగా 250 -300 మిల్లీ లీటర్ల కూల్ డ్రింక్‌లో 150-200 క్యాల్రీలు ఉంటాయి. కూల్ డ్రింక్‌లో అధిక ఫ్క్ట్రోజ్ ఉంటుంది. దీని వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. ఫ్లితంగా డ్యాబెటిస్, బీపీ, గుండె జ్బ్బులు వచ్చే అవకాశం ఉంది. రోజూ కూల్ డ్రింక్స్ తాగే వారిలో అందులో ఉన్న ఫాస్ప్రిక్ యాసిడ్ వల్ల జీర్ణ వ్య్వస్థ దెబ్బ్తింటుంది. తిన్న ఆహారం జీర్ణం కావ్డానికి ఉప్యోగ్ప్డే కాంపనెంట్ హైడ్రాలిక్ యాసిడ్ ఉప్యోగ్పు్డతుంది. ఇది మ్న పొట్ట్లోనే ఉత్ప్త్తి అవుతుంది. కూలా డ్రింక్స్ తాగిన్పు్పడు అందులో ఉండే రసాయ్నం ఈ యాసిడ్‌తో క్లిసిన్పు్పడు జీవ్క్రియ్ల మీద విప్రీత్మైన ప్భ్రావం ప్డుతుంది.ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కూల్డ్రింక్ కంపెనీలు ఏటా ఏడు వేల కోట్లు దోచుకుంటున్నాయి. ప్రజల డబ్బుతో హీరోగా, క్రీడాకారులుగా, అవార్డు గ్రహీతలు పెద్దమనుషులు గా చలామణి అవుతున్నవారు కోట్లల్లో డబ్బు తీసుకుని ప్రజా ఆరోగ్యాన్ని నిర్వీర్యం చేసే వాణిజ్య ప్రకటనలు ఇస్తున్నారు. వీరిపై క్రిమినల్ కేసులు బనాయించాల్సిన ప్రభుత్వం వీరిని, అవార్డులతో సత్కరించడం సిగ్గుచేటు.

కూల్డ్రింకులు పిహెచ్ శాతం టాయిలెట్ క్లినర్స్ యాసిడ్ తో సమానంగా ఉంటుంది. ఇది శరీరానికి చాల ప్రమాదకరం.స్థూలకాయం, ఊపిరి తిత్తులు, బి. పి, షుగర్, ఎముకల మెత్తబడి పోవడం, కీళ్ల నొప్పులు అధికంగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థను ధ్వంసం చేసి, రీనల్ ఫైల్యూర్ కు దారి తీస్తుంది. గర్భిణీ స్త్రీలు కూల్డ్రింకులు సేవిస్తే పుట్టబోయే పిల్లలు – పిండం పై ప్రభావం ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులు, కిడ్నీ, లివర్, క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. తరచుగా అధిక మొత్తంలో చక్కెరతో కూడిన శీతల పానీయాలు మన దైనందిన జీవితంలో పాతుకుపోయాయి.శీ

తల పానీయాలలో అధిక చక్కెర కంటెంట్ ఇన్సులిన్ నిరోధకతకు దారి తీస్తుంది మరియు టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది, చక్కెర శీతల పానీయాల అధిక వినియోగం రక్తంలో చక్కెర స్థాయిలు మరియు హృదయనాళ ఆరోగ్యంపై వాటి ప్రభావం కారణంగా రక్తపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి స్ట్రోక్‌తో సహా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.శీతల పానీయాలలో అధిక స్థాయి చక్కెర మరియు కెఫిన్ పురుషులు మరియు స్త్రీలలో పునరుత్పత్తి ఆరోగ్యం మరియు సంతానోత్పత్తిని ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు.సాఫ్ట్ డ్రింక్స్‌లో ఫాస్పోరిక్ యాసిడ్ ఉంటుంది, ఇది కాల్షియం శోషణకు ఆటంకం కలిగిస్తుంది మరియు ఎముక సాంద్రత నష్టానికి దోహదం చేస్తుంది, ముఖ్యంగా పిల్లలు మరియు పెద్దలలో బోలు ఎముకల వ్యాధి, పగుళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది.

కూల్ డ్రింక్స్ తాగడం వల్ల బరువు పెరగడం, దంత సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం, డీహైడ్రేషన్, కిడ్నీ సమస్యలు మరియు క్యాన్సర్ వచ్చే ప్రమాదం వంటి అనేక ప్రతికూల ఆరోగ్య ప్రభావాలు ఉంటాయి.ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శీతల పానీయాల వినియోగాన్ని పరిమితం చేయడం మరియు నీరు, హెర్బల్ టీ లేదా సహజ పండ్ల రసాలు వంటి ఆరోగ్యకరమైన పానీయాల ఎంపికలను ఎంచుకోవడం ఉత్తమం.మజ్జిగ, కొబ్బరినీళ్లు ఇవి అందుబాటులో లేకపోతే ఇంటిలోనే అల్లంతో చేసినటువంటి నీళ్లు,పుదీనా, కొత్తిమీర, టమాట, కరివేపాకు, మునగాకు వంటి ఆకులను ఉపయోగించి తయారు చేసినటువంటి వాటిని తాగితే ఆరోగ్యానికి మంచిది. ఇంకా ఈ వేసవికాలంలో నిమ్మరసంలో ఉప్పు వేసుకుని తాగిన, వేసుకోకుండా తాగిన కూడా ఆరోగ్యానికి మంచిదే. అందుకే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులతో మాత్రమే మనం జ్యూస్ చేసుకుని తాగాలి. అలా అయితేనే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

– మోటె చిరంజీవి
99491 94327

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News