బెంగళూరు. ఆర్టిసి బస్సు డ్రైవర్ గుండెపోటుతో స్టీరింగ్ పై కుప్పకూలి చనిపోయిన సంఘటన ఆంద్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లాలో జరిగింది. బస్సు రోడ్డు పక్కకు వెళ్లి ఆగిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు కావలి నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… డ్రైవర్ రసూల్ ఆర్‌టిసి సూపర్ లగ్జరీ బస్సుకు డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.
బస్సు కావలి నుంచి బెంగళూరు వెళ్తుండగా రాయచోటి ప్రాంతం మదనపల్లి సమీపంలోకి రాగానే రసూల్ కు గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే అతడు స్టీరింగ్‌పై కుప్పకూలడంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగిపోయింది. ప్రయాణికులు అప్రమత్తమై అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు పేర్కొన్నారు. రసూల్ మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారరు. బస్సును రాయచొటి ఆర్‌టిసి డిపోకు తరలించామని సిఐ విశ్వనాథ రెడ్డి తెలిపారు.