- Advertisement -
మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి ః నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని తర్నికల్ గ్రామ సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు ప్రకారం తర్నికల్ గ్రామానికి చెందిన డేరంగుల వెంకటయ్య(45) గ్రామం నుంచి కల్వకుర్తి వైపు fట్రాక్టర్ నడుపుకుంటూ వస్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులు తమ గ్రామానికి తీసుకెళ్లారు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
- Advertisement -