Friday, August 22, 2025

కొలంబియాలో హెలికాప్టర్ పై డ్రోన్లతో దాడి: 13 మంది మృతి

- Advertisement -
- Advertisement -

బోగోటా: కొలంబియాలో ఒక కారు బాంబు దాడి,  పోలీసు హెలికాప్టర్‌పై డ్రోన్లతో దాడి చేయడంతో 13 మంది చనిపోయారు. ఉత్తర కొలంబియాలోని ఆంటియోకియా ప్రాంతంలో కోకా ఆకులను (డ్రగ్స్) పట్టుకునేందుకు వెళ్తున్న హెలికాప్టర్‌పై డ్రోన్లతో దాడి చేయడంతో ఎనిమిది మంది పోలీసులు మృతి చెందారు.  కొలంబియా విప్లవ సాయుధ దళాలు ఈ దాడులకు పాల్పడే అవకాశం ఉందని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తెలిపారు. కొలంబియాలోని నైరుతి పట్టణమైన కాలీలో ఓ సైనిక విమానయాన పాఠశాల సమీపంలో బాంబులతో వెళ్తున్న వాహనం పేలడంతో ఐదుగురు మరణించగా 30 మంది గాయపడిన విషయం తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News