- Advertisement -
రాజమండ్రి సెంట్రల్ జైలుపై డ్రోన్ కలకలం సృష్టించింది. జైలు సమీపంలోని ఒక అపార్ట్‌మెంట్ నుంచి గుర్తు తెలి యని వ్యక్తి డ్రోన్ ఎగురవేశారు. సెంట్రల్ జైలు ఆవరణలోకి డ్రోన్ రావడంతో పోలీసులకు జైలు సూపరిటెండెంట్ రాహుల్ ఫిర్యాదు చేశారు. వైసిపి ఎంపి మిథున్ రెడ్డి ఇక్కడి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో డ్రోన్ ఎగుర వేయటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నా యి. డ్రోన్ ఎగురవేసిన సంఘటనపై జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ సీరియస్‌గా స్పందించారు. ఎస్పీ ఆదేశాలతో డ్రోన్ ఎగురవేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. చిన్న పిల్లోడు ఆడుకునేందుకు టాయ్ లాంటి డ్రోన్‌ను ఎగురవేసినట్లుగా పోలీసులు గుర్తించారు. సంబంధిత వ్యక్తిపై రాజమండ్రి పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -