- Advertisement -
గచ్చిబౌలిలో మరోసారి డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. ఓ అపార్ట్మెంట్లో డ్రగ్స్ జరుపుకుంటుండగా పోలీసులు దాడులు చేశారు. ఈ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటుండగా.. రాజమండ్రి డిప్యూటీ తహశీల్దార్ మణిదీప్, అమెరికా నుండి వచ్చిన నీలిమ అనే మహిళ, మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 20 గ్రాముల కొకైన్, నాలుగు గ్రాముల ఎండిఎంఎ, 20 ఎన్టీసి మాత్రలు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ ను బెంగళూరు నుండి తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు విక్రమ్తోపాటు ధర్మతేజ అనే వ్యక్తి డ్రగ్స్ విక్రయిస్తున్నారు. వీరిని డిచ్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఈ డ్రగ్స్ పార్టీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -