Monday, September 15, 2025

మత్తులో వివేకానంద విగ్రహాం ద్వంసం.. కర్రతో కొట్టి, ఉమ్మేస్తూ బూతులు తిడుతూ దాడి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఓ యువకుడు మద్యం మత్తులో స్వామి వివేకానంద విగ్రహాన్ని కర్రతో కొట్టి, ఉమ్మేస్తూ బూతులు తిడుతూ దాడి చేసిన సంఘటన శ్రీకాకుళం జిల్లా పొందూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. స్వామి వివేకానంద విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభత్వ పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది గోప్యంగా విగ్రహాన్ని ఎవరికీ కనబడకుండా దాచేశారు. విగ్రహ ధ్వంసం విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీడియో వైరల్ కావడంతో జనసేన నాయకులు దాచేసిన విగ్రహాన్ని వెలికి తీసి అల్లరి మూకల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News