- Advertisement -
హైదరాబాద్: సిటిలో రాత్రి సమయాల్లో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. బీరు బాటిళ్లతో రోడ్లపై చల్ చల్ చేస్తున్నారు. తాజాగా మధురానగర్ లో ఓ వ్యక్తిపై దాడి చేసి.. అతని భార్యను వేధింపులకు గురిచేశారు. నిన్న రాత్రి ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర ముగ్గురు యువకులు.. భార్యభర్తలపై దాడి చేశారు. భర్తపై బాటిళ్లతో దాడి చేసిన ఆకతాయిలు.. తర్వాత అతని భార్యను వేధించారు. ‘నన్నే నీ భర్త అనుకో.. నీ ఫోన్ నెంబర్ ఇవ్వు’ అంటూ వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు రంగంలోకి దిగి ఆకతాయిలను పట్టుకునేందుకు సిసి కెమెరాలను పరిశీలిస్తున్నారు.
- Advertisement -