Wednesday, April 30, 2025

కొత్త తుపాన్

- Advertisement -
- Advertisement -

ఎంఎల్‌ఎలు సంతలో పశువులు కాదు బిఆర్‌ఎస్ పదేళ్లు
యథేచ్ఛగా దోచుకుంది: పిసిసి చీఫ్ మహేశ్‌కుమార్ అవి కొత్త
ప్రభాకర్‌రెడ్డి మాటలు కావు.. కెసిఆర్ వ్యాఖ్యలే ధరణితో
లబ్ధిపొందిన బినామీలే కూల్చాలనుకుంటున్నారు : మంత్రి
పొంగులేటి పడగొడతామంటే పడిపోతామా? : పొన్నం
దుబ్బాక ఎంఎల్‌ఎకు నార్కో అనాలిసిస్ పరీక్ష చేయాలి : అద్దంకి
విచారణకు సిఎం ఆదేశించాలి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామంటే చూస్తూ ఊ రుకోమని ఇక్కడ ఎవరూ చేతులు కట్టుకొ ని కూర్చోలేదని బిఆర్‌ఎస్ నేతలకు కాంగ్రె స్ మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు స్ట్రాం గ్ వార్నింగ్ ఇచ్చారు. పదేళ్లలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంత అవినీతి చేసిందో, ఎంత దోచుకుందో.. కాంట్రాక్టర్ల పేరుతో తెలంగాణ జనం సొమ్మును ఏ విధంగా లూటీ చేసిందో ఆ పార్టీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనం అంటూ వారు ఆ గ్రహం వ్యక్తం చేశారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డ ర్లు, పారిశ్రామిక వేత్తలు ప్రభుత్వా న్ని పడగొట్టాలంటున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మంత్రులు, నేతలు కౌంటర్ ఇచ్చారు. మంగళవారం సీఎల్పీ సమావేశానికి హాజరైన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఘాటుగా స్పందించారు.

చోటామోటా కాంట్రాక్టర్లు కూల్చితే కూలే ప్రభుత్వం కాదు: పిసిసి అధ్యక్షుడు
ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పిసిసి చీఫ్ మహేశ్ గౌడ్ స్పందిస్తూ చోటామోటా కాంట్రాక్టర్లు కూల్చితే కూలే ప్రభుత్వం కాదని, ఎమ్మెల్యేల సంపూర్ణ మద్దతు తమకు ఉందని చెప్పారు. చోటామోటా బ్యాచ్‌కు భయపడమని, బిఆర్‌ఎస్ పదేండ్లు యథేచ్చగా దోచుకుందని ఆయన మండిపడ్డారు. బిఆర్‌ఎస్‌కు అమ్ముడు, కొనుగోళ్లపై అనుభవం ఉందని, ఎమ్మెల్యేలు సంతలో పశువులు కాదని పిసిసి చీఫ్ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యేలపై బిఆర్‌ఎస్ నేతలకు కనీస గౌరవం లేదని, డబ్బులకు అమ్ముడు పోయే ఎమ్మెల్యేలని బిఆర్‌ఎస్ అంటోందని, ప్రభుత్వ పెద్దలతో చర్చించి కొత్త ప్రభాకర్ వ్యాఖ్యలపై తగిన నిర్ణయం తీసుకుంటామని పిసిసి చీఫ్ మహేశ్ గౌడ్ చెప్పారు.

భూ భారతితో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి: మంత్రి పొంగులేటి
అవి కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు కావని, కెసిఆర్ చేసిన వాఖ్యలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కెసిఆర్ తన వ్యాఖ్యలనే తన ఆత్మ కొత్త ప్రభాకర్ రెడ్డితో మాట్లాడించారని ఆయన ఆరోపించారు. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర జరుగుతుందని, దీనిపై విచారణ జరిపే ఆలోచన చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. కొత్త ప్రభాకర్ రెడ్డి సొంతంగా మాట్లాడారని అనుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. ధరణిలో లబ్ధిపొందిన బిఆర్‌ఎస్ బినామీలే ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటున్నారని ప్రభాకర్ రెడ్డి చెప్పారని మంత్రి పొంగులేటి తెలిపారు.

వేల కోట్లతో రాజకీయం చేయాలని బిఆర్‌ఎస్ చూస్తుందన్నారు. ఎప్పుడు వేసే పాత క్యాసెట్‌నే తిరిగి బిఆర్‌ఎస్ వేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ భారతి రావడంతో అక్రమంగా భూములు పొందిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఫైర్ అయ్యారు. భూభారతితో కొల్లగొట్టిన భూములన్నీ వెనక్కి తిరిగోస్తాయన్న భయంతోనే ఈ వ్యాఖ్యలు చేశారని ఆయన అన్నారు. దమ్ముంటే ఎంతమంది ఎమ్మెల్యేలను కొంటారో కొనాలని మంత్రి పొంగులేటి సవాల్ చేశారు. ప్రభుత్వాన్ని కుల్చే కుట్రలు జరిగితే కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.హెచ్‌సియూ భూములను అక్రమార్కులకు కట్టబెట్టాలని బిఆర్‌ఎస్ చూస్తోందని ఆయన ఆరోపించారు. అందుకోసమే ఇలాంటి కుట్రలకు తెరలేపుతోందని, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా, భూ భారతి అమలు చేస్తామని ఆయన తెలిపారు.

కొత్త ప్రభాకర్‌కు ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ ఉందేమో: మంత్రి పొన్నం
కొత్త ప్రభాకర్‌కు ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ ఉందేమోనని బిసి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. కొత్త ప్రభాకర్‌కు జ్యోతిష్యం తెలుసన్న విషయం తమకు తెలియదని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు.

పడగొడదాం రండి అంటే పోవడానికి ఎవరూ సిద్ధంగా లేరన్నారు.
బిజెపితో పాటు గుజరాత్ వ్యాపారులతో కలిసి బిఆర్‌ఎస్ కుట్ర: ఎమ్మెల్సీ అద్దంకి
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి నార్కో అనాలసిస్ పరీక్ష చేయించాలని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. బిజెపితో పాటు గుజరాత్ వ్యాపారులతో కలిసి బిఆర్‌ఎస్ కుట్ర చేస్తుందన్నారు. బిఆర్‌ఎస్ నాయకులు ఏదీ పడితే అది మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేయాలని వారితో నిజాలు చెప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

దీనిపై విచారణ చేయాలని సిఎంను కోరుతాం: విప్ ఆది శ్రీనివాస్, ఎంపి చామల
దుబ్బాక ఎమ్మెల్యే, కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోపణలపై తక్షణం విచారణ జరపాలని ఎమ్మెల్యే, విప్ ఆది శ్రీనివాస్, ఎంపి కిరణ్ కుమార్ రెడ్డిలు ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న యత్నాన్ని కుట్రకోణంగా భావిస్తున్నామని వారు మండిపడ్డారు. కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని సిఎంను కోరుతామన్నారు. కుట్ర కోణం ఉన్నట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారన్నారు. బిఆర్‌ఎస్ నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈర్ష్య ఎందుకని వారు ప్రశ్నించారు. అందరూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారని, మరో ఐదేళ్లు కూడా తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News