- Advertisement -
మన తెలంగాణ /నాగర్‌కర్నూల్ ప్రతినిధి: మండలంలోని రఘుపతిపేట దుందుబి వాగు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దుందుబి వాగు ప్రవాహం కొనసాగుతున్న సందర్భంగా శనివారం ఉదయం దుందుబి వాగులో తెల్కపల్లి మండలం గౌరరం గ్రామానికి చెందిన సొంట జంగయ్య (60) వాగులో నడుచుకుంటూ వెళ్తున్న సందర్భంలో కాలు జారీ కింద నీటిలో పడగా స్థానిక గ్రామస్తులు, యువకులు గమనించి వెంటనే లేవగా అప్పటికే నీరు మింగి మృతి చెందాడని తహసీల్దార్ ఇబ్రహం తెలిపారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులు మృతుని స్వగ్రామానికి తీసుకొని వెళ్లారని తెలిపారు. అనంతరం దుందుబి వాగులో బ్రిడ్జి నిర్మాణానికి పిల్లర్ గుంతలు తీయడం, కొన్ని పిల్లర్ లు వేయడం వల్ల నీటి ఒరవడిని హిటాచి, జేసిబిలతో ఇసుక అడ్డంకులను తొలగించినట్లు తహసీల్దార్ ఇబ్రహీం తెలిపారు. ఆయన వెంట ఆర్‌ఐ, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
- Advertisement -