- Advertisement -
రాష్ట్రంలో దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు అన్నీ పాఠశాలలకు సెలవులు ఉంటాయని వెల్లడించింది. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు జూనియర్ కాలేజీలకు సెలవులు ప్రకటించారు. దసరా పండగ నేపథ్యంలో విద్యాసంస్థలకు ఈసారి మొత్తం 13 రోజుల పాటు సెలవులను ఉండనున్నాయి. వరుసగా ఏకంగా 13 రోజులు సెలవులు రావడంతో విద్యార్థులు ఆనందంలో మునిగిపోయారు. నగరాల్లోని వివిధ హస్టళ్లలో ఉండే విద్యార్థులు తమ ఊర్లకు వెళ్లేందుకు ఇప్పటినుంచే ప్రణాళికలు వేసుకుంటున్నారు. సెప్టెంబరు 21వ తేదీ(ఆదివారం) నుంచి 3వ తేదీ(శుక్రవారం) వరకు సెలవులుగా ప్రకటించింది. అక్టోబర్ 4న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ సారి అక్టోబర్ 2వ తేదీ గాంధీజయంతి రోజునే దసరా పండుగ వచ్చింది.
- Advertisement -