- Advertisement -
జునేయు: అలస్కాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3గా నమోదైంది. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండడంతో అలస్కాకు యుఎస్ జియోలాజికల్ సర్వే సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంటుందని మిచిగాన్ టెక్నికల్ యూనివర్సీటి వెల్లడించింది. పోపోఫా ఐలాండ్ సమీపంలోని శాండ్ పాయింట్ వద్ద పది కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్ర నాభి ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
- Advertisement -