- Advertisement -
ఢిల్లీ: ఉత్తర భారతంలోని ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యానాలో భూకంప సంభవించింది. భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైందని భూపరిశోధన అధికారులు వెల్లడించారు. భూకంపం కేంద్రం హర్యానాలోని ఝజ్జర్ ప్రాంతంలోని పది కిలో మీటర్ల లోతులో ఉన్నట్టు వెల్లడించింది. భూకంప తీవ్రత స్వల్పంగా ఉండడంతో ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని సమాచారం.
- Advertisement -