- Advertisement -
పరిగి: వికారాబాద్ జిల్లా పరిగిలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో భూమి కంపించింది. పరిగి మండలం పరిసరప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూపరిశోధన అధికారులు ఇంకా వివరాలు వెల్లడించలేదు. ఆస్తి, ప్రాణ నష్టం గురించి కూడా వివరాలు తెలియలేదు.
- Advertisement -