- Advertisement -
ఎపియా: సమోవా ద్వీపంలో శుక్రవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.6గా ఉందని అమెరికా జియోలాజికల్ అధికారులు వెల్లడించారు. సమోవా వాయువ్య దిశలో 400 కిలో మీటర్ల దూరంలో 314 కిలో మీటర్ల భూకంప కేంద్రం ఉందని ప్రకటించారు. భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం
- Advertisement -