టర్కీలో భారీ భూకంపం సంభవించింది. గురువారం రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని అధికారులు వెల్లడించారు. టర్కీలోని సెంట్రల్ అనటోలియా ప్రాంతంలోని కోన్యా ప్రావిన్స్‌లో భూకంపం సంభవించినట్లు సమాచారం. భూకంపం కారణంగా ఇంకా ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని సమాచారం. కాగా, బుధవారం తెల్లవారుజామున గ్రీస్‌లోని ఫ్రై సమీపంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. తెల్లవారుజామున 1:51 గంటలకు 78 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ఈజిప్టులోని కైరో వరకు, అలాగే ఇజ్రాయెల్, లెబనాన్, టర్కీ, జోర్డాన్‌లలో కూడా ప్రకంపనలు సంభవించాయి.
కాగా, 2023 ఫిబ్రవరిలో టర్కీ, సిరియాలో భారీ భూకంపాలు సంభవించాయి. మొదటి భూకంపం 7.8 తీవ్రతతో నమోదైంది, తరువాత రెండవ భూకంపం 7.5 తీవ్రతతో సంభవించింది. ఈ భూకంపాల కారణంగా టర్కీలో 59,000 మంది, సిరియాలో 8,000 మంది మరణించారు.