Thursday, August 14, 2025

పరిగి మండలంలో భూ ప్రకంపనలు..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/పరిగి: వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని పలు గ్రామాలలో గురువారం తెల్లవారుజామున 4 గంటలకు స్వల్పంగా భూకంపం వచ్చింది. పరిగి మున్సిపల్ పరిధిలోని టీచర్స్ కాలనీ, న్యాత్‌నగర్, రంగాపూర్, బసిరెడ్డిపల్లి, సోమన్‌గుర్తి గ్రామాలలో మూడు నిమిషాల పాటు భూ ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. దీంతో జనాలు భయంతో ఇండ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. పూడూరు మండంల సోమన్‌గుర్తి గ్రామంలో వీరన్న వాళల అన్న బుచ్చయ్య ఇళ్లు కూలిపోయింది. భూ కంపం వచ్చినప్పుడు దడ దడ శబ్దం వచ్చిందని గ్రామస్థులు తెలిపారు. ఎవరికి ఏలాంటి ప్రాణ, ఆస్థినష్టం జరగలేదు. ఈ విషయం తెలుసుకున్న వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్, జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి, ఆర్డీవో, తహాశీల్‌దార్, ఎంపిడిఓలు కలిసి బసిరెడ్డిపల్లి గ్రామాన్ని సందర్శించారు. స్థానికులతో భూకంపం వచ్చిన విషయాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఇండ్ల పగుళ్లు, ఇతర నష్టం జరిగితే వెంటనే గుర్తించాలని అధికారులను ఆదేశించారు.

ప్రజలు ఏలాంటి భయాలకు గురి కావద్దని తెలిపారు. ఈ విషయంపై సైంటీస్ట్‌లతో మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. వాళ్లు పరిశీలించి చెబుతారన్నారు. ఇది భూకంపం అయితే మళ్లి రావడం జరుగుతుందన్నారు. సిబ్బందిని అప్రమత్తం చేయడం జరిగింది. స్థానికులకు ఏలాంటి విషయాలు తెలిసిన మాకు చెప్పాలన్నారు. జిల్లాలో ఆగస్టు 17 వరకు ఎక్కవ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అందుకు జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అత్యవసరం అనుకుంటే తప్ప ఎవరూ బయటికి రావద్దని చెప్పారు. కురుస్తున్న వార్‌సల కారణంగా పర్యటక ప్రాంతాలలో బోటింగ్, ట్రెక్కింగ్‌లు నిలిపి వేయాడం జరిగిందన్నారు. పర్యటకులు ఎవరూ రావద్దని సూచించారు. వర్షాల వల్ల భారీగా ఎప్పొంగుతున్న పరిగి వాగును అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వాసుచద్ర, తహాశీల్‌దార్ వెంకటేశ్వరీ, వివిధ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News