Wednesday, May 21, 2025

ప్రియురాలి కూతురిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలని ప్రియుడు దాడి.. పిఎస్‌లో ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రియురాలితో సహజీవనం చేస్తూ ఆమె కూతురిని తనతో పెళ్లి చేయాలని ప్రియుడు వేధించాడు. ఆమె ప్రియుడికి ఎదురు తిరగడంతో కుమార్తె, తల్లిని చితకబాదాడు. దీంతో ప్రియుడిపై ప్రియురాలు పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేసింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో జరిగింది. ఓ గ్రామానికి చెందిన మహిళ భర్త తొమ్మిది సంవత్సరా ల క్రితం మృతి చెందడంతో తన కుమార్తెతో కలిసి ఉంటుంది. పి నాగిరెడ్డి అనే వ్యక్తి పరిచయం కావడంతో ఇద్దరు కలిసి సహజీవనం సాగిస్తున్నారు. నాగిరెడ్డి ఓ బాలికను పెళ్లి చేసుకొని అనంతరం ఆమెను వదిలేశాడు. నాగిరెడ్డికి ప్రియురాలి కూతురుపై కన్నుపడింది. ఆమె కూతురును తనకు ఇచ్చి పెళ్లి చేయాలని ప్రియురాలిపై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఆమె వినకపోవడంతో ఆమెపై పలుమార్లు దాడి చేశాడు. దీంతో ప్రియురాలు తన కూతురుతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీస్ స్టేషన్‌కు సమీపంలో తన కుమార్తెపై నాగిరెడ్డి దాడి చేయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News