Friday, August 1, 2025

ఉప రాష్ట్రపతి ఎన్నిక.. ఎలక్టోరల్ కాలేజీని ఖరారు చేసిన ఈసి

- Advertisement -
- Advertisement -

2025 ఉప రాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధమైంది. జగదీప్ ధన్కడ్ రాజీనామా కారణంగా ఉపరాష్ట్రపతి ఎన్నికకు అవసరమైన ఎలక్టోరల్ కాలేజీని ఖరారు చేసినట్లు ఎన్నికల సంఘం గురువారం తెలిపింది. భారత ఉపరాష్ట్రపతిని రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు, లోక్ సభకు ఎన్నికైన సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నికుంటుంది. ఉప రాష్ట్రపతి ఎన్నికలకు ఎలక్టోరల్ కాలేజీ జాబితాను ఖరారు చేసినట్లు పోల్ అథారిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. నోటిఫికేషన్ వెలువడిన తేదీ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్ లో ఎలక్టోరల్ కాలేజీ జాబితా అందుబాటులో ఉంటుంది. త్వరలో ఈ జాబితా ప్రకటించే అవకాశం ఉందని ఎన్నికల సంఘం తెలిపింది. తన పదవీకాలం ఇంకా రెండు ఏళ్లు ఉన్నా.. కొంత ముందుగానే జూలై 21న జగదీప్ ధన్కడ్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News