పాకిస్తాన్ నుంచి వచ్చే అన్ని దిగుమతులపై నిషేధం
దాయాది నౌకలకు భారత రేవుల్లో నో ఎంట్రీ మెయిల్, పార్శిల్
సర్వీసుల నిలిపివేత ఎలక్ట్రానిక్, ఈకామర్స్ వస్తువుల ఎగుమతులను
పరిమితం చేయనున్న ఇండియా నిషేధాజ్ఞలు తక్షణమే అమల్లోకి
దేశ భద్రత, ప్రజాప్రయోజనాల దృష్టా నిషేధాజ్ఞలు విధించినట్లు
స్పష్టీకరణ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అమలులో..
న్యూఢిల్లీ : పహల్గాం లో ఏప్రిల్ 22న జరిగిన టెర్రరిస్ట్ చర్యతో ఆగ్రహంతో రగిలిపోతున్నభారత్ పాకిస్తాన్‌పై మరో బ్రహ్మాస్త్రాన్ని ప్ర యోగించింది. పాకిస్తాన్ నుంచి అన్ని దిగుమతులను నిషేధించింది. పాకిస్తాన్ నుంచి ది గుమతులతో పాటు, వచ్చే మెయిల్, పార్శిల్ లకు కూడా ఈ బ్యాన్ వర్తిస్తుంది. అలాగే ఇ క భారతదేశంలోని ఏ ఓడరేవులోనూ ఆ దేశానికి చెందిన నౌకలను అనుమతించరు. పాక్ జెండాలు కలిగిన నౌకలు భారత రేవులను సందర్శించకుండా నిషేధం విధించారు. ముంబై లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్, ప్రధాన కార్యాలయం నుంచి మర్చంట్ షి ప్పింగ్ చట్టం 1958 కింద ఈ నిషేధం విధించారు. జాతీయ భద్రత, ప్రయోజనాలదృష్ట్యా తక్షణం ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది. ప హల్గాం ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్తతల మధ్య జరుగుతున్న పరిణామాల లో తాజా నిర్ణ యం ఇది.
అసలే ఏప్రిల్ 22 దాడితో భారతదేశం రగిలిపోతుంటే, పాక్ సైన్యం సరిహద్దుల్లో వరుసగా పది రోజులుగా కవ్వింపు కాల్పులు జరుపుతూ, కాల్పుల నియంత్రణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. తాజాగా పాకిస్తాన్ 450 కిలోమీటర్ల పరిధి గల బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించి మరో రెచ్చగొట్టేచర్యకు పాల్పడడంతో భారత ప్రభుత్వం కఠిన చర్యకు సిద్ధమైంది. 2019 లో పుల్వామా దాడి తర్వాత, పాకిస్తాన్ నుంచి దిగుమతి అయ్యే తాజా పండ్లు, పెట్రోలియం ఉత్పత్తులు, సిమెంట్ తో సహా అన్ని వస్తువులపై భారతదేశం 200 శాతం సుంకాన్ని విధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా పాక్ తన టెర్రరిస్ట్ ల కార్యకలాపాలకు అండగానే నిలిచింది. పాకిస్తాన్ ఉత్పత్తులను ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ దిగుమతి చేసుకోవడాన్ని తక్షణమే నిషేధించబడింది.
తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకూ ఈ నిషేధం అమలులో ఉంటుంది. జాతీయ భద్రత, ప్రజా విధానం దృష్ట్యా ఈ నిషేధచర్యలు తీసుకున్నట్లు మే 2వ తేదీన వాణిజ్యమంత్రిత్వశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఏమైనా మినహాయిం పు కోసం అభ్యర్థనలు ఉంటే, భారత ప్రభుత్వం ముందస్తు అనుమతి తప్పని సరి అని ఆ నోటిఫికేషన్ స్పష్టం చేసింది. ఇప్పటికే భారత- పాక్ సరిహద్దులో అట్టారీ – వాఘా చెక్ పోస్ట్ ను మూసివేశారు. పాక్ విమానాలకు గగన తలం ప్రవేశం లేకుండా నిషేధించారు. ఇప్పుడు భారత ఓడరేవుల్లో పాక్ నౌకల ప్రవేశాన్ని నిషేధించడంతో త్రిముఖ దిగ్భంధం అమలులోకి వచ్చినట్లయింది. నిజానికి పాక్ నుంచి దిగుమల కన్నా, భారతదేశం ఆదేశానికి చేసే ఎగుమతులే ఎక్కువ. భారత్2021-22లో పాకిస్తాన్ కు 512.82 మిలియన్ అమెరికా డాలర్ల మేరకు 2022- 23 సంవత్సరంలో 627.1 మిలియన్ డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది. కాగా, పాకిస్తాన్ నుంచి 2021-22లో అయిన దిగుమతులు 2.54 మిలియన్ డాలర్లు, అలాగే 2022-23లో దిగుమతులు 20.11 మిలియన్ డాలర్ల విలువైనవి. 2024 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి మధ్య పాక్ కు భారత ఎగుమతులు 447. 65 మిలియన్ డాలర్ల మేరకు జరుగగా, దిగుమతులు 0.42 మిలియన్ల విలువైనవి మాత్రమే