ప్రధాని నరేంద్ర మోడి హయాంలో దేశంలో ఆర్థిక విప్లవం వచ్చిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. 11 సంవత్సరాల్లో 278 రేట్లు పెరిగిన బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లు, బ్యాంకు అకౌంట్లు అని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా 56 కోట్ల జన్‌ధన్ ఖాతాల్లో రూ. 2.68 లక్షల కోట్ల నగదు జమ అయినట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో 1.3 కోట్ల జనధన్ అకౌంట్లలో రూ.5.-055.35 కోట్లు జమ చేసినట్లు ఆయన వివరించారు. సామాన్యులకు బ్యాంకు సేవలు అందుబాటులోకి వచ్చాయని ఆయన తెలిపారు. సమ్మిళిత ఆర్థికాభివృద్ధిని పెంపొదించడంతో పాటు కోట్లాది మందికి, ముఖ్యంగా మహిళలకు,
యువతకు, అణగారిన వర్గాలకు గౌరవాన్ని అందించే లక్షంతో ప్రధాని మోడి తీసుకుని వచ్చిన జన్‌ధన్ పథకం 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నదని ఆయన వివరించారు. దేశంలోని అనేక మంది బడుగు, బలహీన, పేద ప్రజలకు బ్యాంకు ఖాతాలు కూడా ఉండేవి కాదని ఆయన తెలిపారు. దీంతో ప్రధాని నరేంద్ర మోడి 2014 సంవత్సరం ఆగస్టు 28న జన్‌ధన్ పథకాన్ని తీసుకుని వచ్చారని ఆయన వివరించారు. 2014 సంవత్సరానికి ముందు దేశవ్యాప్తంగా మొత్తం 3.35 బేసిక్ సేవింగ్స్ అకౌంట్లు మాత్రమే ఉండగా, వాటిలో ఖాతాదారులు జమ చేసుకున్న మొత్తం రూ. 960 కోట్లు మాత్రమేనని ఆయన తెలిపారు. నరేంద్ర మోడి ప్రధాని అయిన తర్వాత ఫ్రజలందరినీ బ్యాంకింగ్ వ్యవస్థలోకి, సమ్మిళిత ఆర్థిక వ్యవస్థలోకి తీసుకొచ్చేందుకు సంస్కరణలు తీసుకుని వచ్చినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు.