హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసులు నమోదు చేసింది. సినీ నటులు రానా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, శ్రీముఖి, ప్రకాశ్‌రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, వైసిపి అధికార ప్రతినిధి శ్యామల, ఇన్‌ప్లుయెన్సర్లు వర్షిణి, సిర హనుమంతు, వసంతి, శోభాషెట్టి, విష్ణుప్రియ, హర్షసాయి, టేస్టీతేజ, రీతూచౌదరి, బండారుసుప్రీత, అమృతాచౌదరి, నయనిపావని, పండు, ఇమ్రాన్‌ఖాన్ తదితరులపై సైబరాబాద్ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఇడి విచారణ చేపట్టనుంది. సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్స్, ఇన్‌ఫ్యుయెన్సర్లపై పిఎంఎల్‌ఎ కింద విచారణ చేయనుంది. సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు భారీగా డబ్బులు తీసుకొని చట్ట విరుద్ధ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలంటూ విస్తృతంగా ప్రచారం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. యాప్‌ల కారణంగా చాలా మంది అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్నారు. కొన్ని కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయారని పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే.
- Advertisement -