Monday, August 11, 2025

వాద్రాకు రూ.58కోట్ల ముడుపులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : గుర్గావ్ జరిగిన అక్రమ భూ లావాదేవీల వ్యవహారంలో ప్రియాంక గాంధీ భర్త , రాహుల్ బావ రా బర్ట్ వాద్రాకు ఇడి తాజా చార్జీషీట్‌తో షాక్ ఇచ్చింది. ఆ యనకు ఈ కేసుకు సంబంధించి మొత్తం మీద రూ. 58 కోట్ల వరకూ ముడుపులుగా ముట్టాయని తమ నేరాభియోగాలలో తెలిపింది.ఆస్తుల కొనుగోళ్లు, అప్పుల చె ల్లింపులకు ఆయన ఈ డబ్బు వాడారని ఇడి తమ అభియోగ పత్రంలో పేర్కొంది. స్కై లైట్ హాస్పిటాల్టీ ప్రైవేటు లిమిటెడ్ (ఎస్‌ఎల్‌హెచ్‌పిఎల్)నుంచి రూ 53 కోట్లు , రూ 5 కోట్లు బ్లూ బ్రీజ్ ట్రేడింగ్ కంపెనీ నుంచి ఆయన పుచ్చుకున్నారని ఆరోపించారు. వీటిని స్వప్రయోజనాలకు వాడుకున్నారని తమ పత్రంలో తెలిపారు. పెట్టుబడులకు , స్థిరాస్తుల కొనుగోళ్లకు ఈ సొమ్ము వాడకం జరిగిందని ఛార్జీషీట్‌లో పేర్కొంది. వాద్రాపై అక్రమ ఆర్థిక లావాదేవీల కేసు 2018 నుంచి సాగుతోంది. ఆయనపైనా,

అప్పటి హర్యానా సిఎం మనోహర్ లాల్ కట్టర్, కాంగ్రెస్ నేత భూపీందర్ సింగ్ హూడా, రియల్ ఎస్టేట్ కంపెనీ డిఎల్‌ఎఫ్‌తో పాటు ఒక ప్రాపర్టీ డీలర్‌పైనా ఇడి ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. వాద్రాను ఇతరులను ఈ కేసుకు సంబంధించి పలు సార్లు ఇడి విచారించింది. సోనియా గాంధీ అల్లుడు అయిన వాద్రాపై ఫోర్జరీ , మోసాలు, అవినీతి వంటి పలు ఆరోపణలు పొందుపర్చారు. గుర్గావ్‌లో వాద్రా ఇతరులు తమ అధికార రాజకీయ పలుకుబడితో పలు ఆస్తులను సొంతం చేసుకున్నారు. ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ నుంచి 2008 ఫిబ్రవరిలో అతి చవకగా రూ 7.5 కోట్లకు మూడున్నర ఎకరాల భూమి కొనుగోలు చేసి, దీనిని తరువాత డిఎల్‌ఎఫ్ రియల్ ఎస్టేట్ సంస్థకు రూ 58 కోట్లకు అమ్మారని ఇడి తమ అభియోగాలలో తెలిపింది. ఇదంతా కూడా పెద్ద ఎత్తున జరిగిన మనీలాండరింగ్ వ్యవహారం అని అప్పట్లో తెలిపారు. ఈ అంశాన్ని ఇప్పుడు పొందుపర్చిన ముడుపుల విషయాన్ని వేర్వేరుగా ఇడి విచారిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News