- Advertisement -
హైదరాబాద్: బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో విచారణను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో దాదాపు 25 మందిని విచారించిన ఇడి.. తాజాగా పలువురు సెలబ్రిటీలకు విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. అందులో ప్రముఖ హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) కూడా ఉన్నారు. నిజానికి రానా ఈరోజు (జూలై 23) ఇడి విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ, ఆయన తనకు షూటింగ్ ఉందని.. విచారణకు తర్వాత హాజరవుతానని ఇడిని కోరారు. దీంతో ఇడి రానాకు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 11వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. కాగా, రానాతో పాటు నటులు ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మిలకు కూడా ఇడి నోటీసులు ఇచ్చింది. ప్రకాశ్ రాజ్ జూలై 30న, విజయ్ ఆగస్టు 6న, లక్ష్మి ఆగస్టు 13న విచారణకు రావాలని స్పష్టం చేసింది.
- Advertisement -