మన తెలంగాణ/హైదరాబాద్ : బెట్టింగ్ యాప్ కేసులో ఇడి అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో దర్యాప్తు వేగవం తం చేశారు. కేసులో నిందితులుగా ఉన్న సినీ సెలబ్రెటీలకు ఇ డి అధికారులు సోమవారం నోటీసులు జారీ చేశారు. హీరో రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మిలకు నోటీసులు ఇస్తూ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో వె ల్లడించారు. ఈ నెల 23న రానా, 30న ప్రకాష్‌రాజ్ రావాలని ఆదేశించారు. వచ్చే నెల ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, 13న మంచు లక్ష్మిలు విచారణకు రావాలని నోటీసుల్లో స్పష్టం చే శారు.విదేశీ బెట్టింగ్ యాప్‌లను వీరు ప్రమోట్ చేసినట్లు గుర్తించారు. ఈ క్రమంలో దగ్గుబాటి రానా, ప్రకాష్‌రాజ్, విజయ్ దే వరకొండ, మంచు లక్ష్మీప్రసన్నలని మనీ లాండరింగ్ కోణం లో విచారణ చేయనున్నట్లు సమాచారం. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు ఆయా కంపెనీల నుంచి సినీ సెలబ్రెటీలకు నగదు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై విచారణ చే యనున్నారు.
ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు వీరిపై కేసులు నమోదు చేశారు. ఈ ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఇడి అధికారులు ఇసిఐఆర్ నమోదు చేశారు. సినీ సెలబ్రెటీలు బెట్టింగ్ యాప్‌లని ప్రమోట్ చేయడం తోనే పలువురు ఆకర్షితులు అయ్యారని ఇడి అధికారులు, పోలీసులు చెబుతున్నారు. బెట్టింగ్ యాప్‌లలో పెట్టుబడి పెట్టి అమాయకులు మోస పో యినట్లు అధికారులకు ఫిర్యాదులందాయి. ఎంతోమంది బె ట్టింగ్ యాప్‌ల బారిన పడి ఆత్మహత్యలు చేసుకోవడంతో ఇడి అధికారులు, పోలీ సులు ఈ కేసుని సీరియస్‌గా తీసుకుని వి చారణ జరుపుతున్నారు. ఈ కేసులో సుమారు 29 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు చేశారు. రానా, విజయ్ దేవరకొండ, లక్ష్మి మంచు, ప్రకాశ్ రాజ్, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, యాంకర్ శ్రీముఖీ, విష్ణు ప్రియ, రితూ చౌదరి, యాంకర్ శ్యామల వంటి తదితరులపై కేసు నమోదు చేశారు. అలాగే సోషల్ మీడియా ఇన్ ఫ్లూయేన్సర్లైనా వర్షిణి, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, నీతూ అగర్వాల, అమ్రతి చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పద్మావతి, పుండ, ఇమ్రాన ఖాన్, హర్ష సాయి, సన్నీ యాదవ్, తేజ, బండారు సుప్రీతలపై కేసు నమోదైంది. ఇక ఈ కేసు విచారణలో
భాగంగా పంజాగట్టు పోలీసులు పలువురు సెలబ్రిటీలను విచారించిన సంగతి విదితమే. విష్ణు ప్రియ, రితూ చౌదరితో పాటు పలువురిని ఈ కేసులో మేలో పోలీసులు విచారించారు. కాగా ఈ బెట్టింగ్ యాప్స్ అరికట్టేందుకు ఏకంగా ఆర్‌టిసి ఎండి, మాజీ సిపి సజ్జనార్ రంగంలోకి దిగారు. బెట్టింగ్‌లకు పాల్పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని రాష్ట్ర స్థాయిలో ప్రచారం కూడా నిర్వహించారు. పోలీసుల నుంచి ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఇడి ఇప్పటికే సేకరించింది. మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితులను విచారించాలని ఇడి నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే నిందితులకు ఇడి నోటీసులు ఇచ్చింది. నటులు రానా, విజయ్ దేవర కొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి వంటి స్టార్ యాక్టర్లకు ఇడి నోటీసులు ఇవ్వడంతో ఈ కేసులో ఏం జరగబోతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
గూగుల్, మెటాకు మరోసారి ఇడి నోటీసులు
ఇదిలా ఉండగా, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల కేసులో గూగుల్ , మెటా సంస్థల ప్రతినిధులు ఇడి ఎదుట హాజరవలేదు. సంబంధిత సమాచారం, పత్రాలను సేకరించడానికి తమకు మరింత సమయం కావాలని ఆ సంస్థలు ఇడిని కోరినట్లు సమాచారం. దీంతో జూలై 28న ఆ సంస్థల ప్రతిని ధులు హాజరు కావాలంటూ ఇడి కొత్త సమన్లు జారీ చేసింది. పిఎంఎల్‌ఎ చట్టం కింద వారి వాంగ్మూలాలను ఇడి నమోదు చేయనుంది. ఆన్ లైన్ బెట్టింగ్ , గ్యాంబ్లింగ్‌లలో మనీలాండరింగ్ , హవాలా లావాదేవీలు జరుగుతున్నాయనే ఆరోపణలపై ఇడి కేసు నమోదు చేసింది. బెట్టింగ్ యాప్ లను తమ మాధ్యమాల్లో గూగుల్ , మెటాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి.బెట్టింగ్ యాప్ ల ప్రకటనలకు స్లాట్లు కేటా యిస్తూ వెబ్ సైట్ల లింక్‌లను అందుబాటులో ఉంచుతున్నాయని ఇడి వెల్లడించింది. మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కాం విచారణలో ఇప్పటికే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలను ఇడి విచారించింది.