Thursday, September 4, 2025

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్… ధావన్ ను విచారించిన ఇడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. సెలబ్రిటీలు, క్రికెటర్లకు ఇడి ఎదుట హాజరుకావాలని నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్‌కు ఇడి నోటీసులు జారీ చేయడంతో గురువారం ఆయన విచారణకు హాజరయ్యారు. పిఎంఎల్‌ఎ చట్టం ప్రకారం అతడి నుంచి ఇడి స్టేట్‌మెంట్ రికార్డు చేస్తోంది. ఇల్లీగల్ యాప్స్‌కు ప్రమోషన్ వెనుక ఏదైనా ఆర్థిక కుట్ర ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత నెలలో సురేష్ రైనాను ఇడి విచారించిన విషయం తెలిసిందే. పార్లమెంట్ వేదికగా రియల్ మనీ ఆన్‌లైన గేమింగ్‌ను బ్యాన్ చేసిన విషయం విధితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News