Thursday, July 24, 2025

సినీ నటుడు రానాకు మరోసారి ఇడి నోటీసులు

- Advertisement -
- Advertisement -

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన కేసులో సినీ నటుడు దగ్గుబాటి రానాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మరోసారి నోటీసులు జారీ చేసింది. గతంలోనే రానాకు ఇడి నోటీసులు జారీ చేయగా, బుధవారం విచాణకు హాజరు కావాల్సి ఉంది. సినిమా షూటింగ్‌ల నేపథ్యంలో రాలేకపోయానని, విచారణకు హాజరైయ్యేందుకు మరోసారి అవకాశం కల్పించాలని ఇడికి రానా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో మరో తేదీని పేర్కొంటూ ఇడి మరోసారి నోటీసులు జారీ చేసింది. ఆగస్ట్ 11వ తేదీన తప్పనిసరిగా హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. కాగా బెట్టింగ్ యాప్‌లకు ప్రచారకర్తలు వ్యవహరించిన 29 మంది నటులు, సోషల్ మీడియా ఇన్‌ప్లూయోన్సర్లపై కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్, సూర్యాపేట, పంజాగుట్ట, మియాపూర్, విశాఖట్నంలో లోన్ యాప్‌లపై నమోదయిన వేరువేరు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఇడి ఇన్‌ఫర్మేషన్ రిపోర్ట్(ఇసిఐఆర్) రిజిస్టర్ చేసింది. ఈ ఇన్‌ఫర్మేషన్ రిపోర్ట్‌లో ఇడి 29 మందిని చేర్చి విచారించేందుకు నోటీసులు ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News