Tuesday, May 6, 2025

మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్‌గా ఎడ్ల మల్లేష్ నియామకం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్‌గా ఎడ్ల మల్లేష్ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ నియామక ఉత్తర్వులు జారీచేశారు. ఎడ్ల మల్లేష్ ప్రస్తుతం మీర్‌పేట్ మున్సిపల్ కార్పోరేషన్ కార్పోరేటర్‌గా కొనసాగుతున్నారు.

గత మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా కార్పోరేటర్ గా గెలిచిన మల్లేష్ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు సమక్షంలో ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరారు. 2018 ఎన్నికలకు ముందు టీడీపీలో సరూర్ నగర్ మండల పార్టీ అధ్యక్షుడుగా, ఇతర పార్టీ పదవులను సైతం మల్లేష్ ముదిరాజ్ నిర్వర్తించారు. తాజాగా ఆయన్ని మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం ఇంచార్జ్ గా కాసాని జ్ఞానేశ్వర్ నియమించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News