- Advertisement -
మెదక్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, పాపన్నపేట మండలంలోని ఏడుపాయల శ్రీ వనదుర్గాభవాని ఆలయాన్ని గురువారం 11 గంటలకు మూసివేశారు. వాతావరణ శాఖ సూచనల మేరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో మంజీరా నదిలో వరద ప్రవాహం పెరిగి ఆలయం ముందు వరద నీరు ప్రవహిస్తోంది. ఈ వరద నీరు భారీగా పెరిగే అవకాశం ఉంది. భక్తుల భద్రత దృష్టా ఆలయాన్ని మూసివేసి, ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసిన ఆలయ సిబ్బంది, ఆలయ ప్రదాన ద్వారం రాజగోపురంలో శ్రీ వనదుర్గాభవాని అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులు దర్శించుకునేందుకు అవకాశం కల్పించారు. ఆలయ అర్చకులు ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వరద నీరు తగ్గుముఖం పట్టిన తర్వాత ఆలయాన్ని మళ్లీ తెరుస్తామని యధావిధిగా భక్తులకు దర్శనాలు కల్పిస్తామని ఆలయ ఇఒ చంద్రశేఖర్ తెలిపారు.
- Advertisement -