Friday, August 15, 2025

ప్రాణం తీసిన కోడి గుడ్డు

- Advertisement -
- Advertisement -

చెన్నై: కోడి గుడ్డు తింటుండగా గొంతులో ఇరుక్కొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈసంఘటన తమిళనాడు రాష్ట్రం కాంచీపురం జిల్లా ఉత్తిరమేరూర్ పంచాయతీ యూనియన్‌లో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మలైయాంగుళం గ్రామంలో రవి(55), వలర్మతి(45) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు కుమార్తె స్నేహ(24) ఉంది. రవి భవన కార్మికుడుగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బుధవారం రాత్రి వలర్మతి కోడి గుడ్డు కూర వండింది. గుడ్డు కూరతో భోజనం చేస్తుండగా రవి గొంతులో ఇరుక్కొపోయింది. కళ్లు తేలేసి పడిపోవడంతో వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం చెంగల్పట్టు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే రవి చనిపోయాడని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News