Wednesday, August 20, 2025

విద్యుత్ ప్రమాదాలు.. అధికారుల తక్షణ చర్యలు..

- Advertisement -
- Advertisement -
  • విద్యుత్ శాఖ సీఎండి ఆదేశాలతో తక్షణ చర్యలు

మన తెలంగాణ/బోడుప్పల్: నగరంలో రెండు రోజుల వ్యవధిలో వరస విద్యుత్ ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసందే. రామంతపూర్‌, పాతబస్తీలోని బండ్లగూడలో విద్యుత్‌ ప్రమాదాల కారణంగా ఎనిమిది మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో విద్యుత్ అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. విద్యుత్ శాఖ సిఎండి ముషారఫ్ అలీ ఆదేశాల ప్రకారం.. మంగళవారం పీర్జాదిగూడ, మేడిపల్లి, బోడుప్పల్ (Boduppal) తదితర ప్రాంతాల్లో పర్యటించిన విద్యుత్ శాఖ అధికారులు కరెంటు స్తంభాలకు ఏర్పాటుచేసిన కేబుల్ వైర్లను, సెటప్ బాక్స్ లను తొలగించారు. వీటితోపాటు తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను సైతం తొలగిస్తున్నారు. విద్యుత్తు ప్రమాదాలు జరగకుండా నివారించే చర్యల్లో భాగంగా కరెంటు స్తంభాలకు ఏర్పాటు చేసిన కేబుల్ వైర్లను తొలగిస్తున్నామని డిఇ లింగయ్య గౌడ్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ పర్యటనలో ఎడిఇ విజయ్ కుమార్ రెడ్డి, ఎఇ హరినాథ్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News