- Advertisement -
కొలంబో: శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎల్లా-వెల్లవాయ ప్రధాన రహదారిపై మినీ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో 15 మంది మృతి చెందగా 18 మందికి తీవ్రంగా గాయపడ్డారు. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని బదుళ్ల బోధనాస్పత్రికి ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మృతులలో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. ఎల్లా-వెల్లవాయ ప్రధాన రహదారిపై 24వ కిలోమీటర్ మూల మలుపు వద్ద బస్సు అదుపుతప్పి 500 మీటర్ల లోతుగల లోయలో పడిపోయింది. మున్సిపల్ కౌన్సిల్‌కు చెందిన 30 మంది ఉద్యోగులు ఎల్లాలో విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
- Advertisement -