Monday, July 7, 2025

ఎలాన్ మస్క్ కొత్త పార్టీ.. ఏం పేరంటే?

- Advertisement -
- Advertisement -

ది అమెరికా పార్టీ పేరిట ఏర్పాటు
ప్రజలకు తిరిగి స్వేచ్ఛను కల్పించడమే లక్షమని ప్రకటన
రిపబ్లికన్, డెమోక్రాట్లకు ప్రత్యామ్నాయంగా రాజకీయ పార్టీ ఆవిర్భావం
అమెరికా రాజకీయాలపై బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఎఫెక్ట్

వాషింగ్టన్ డిసి: అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ మాజీ మిత్రుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అమెరికా పార్టీ అనే రాజకీయ పార్టీని ఆవిష్కరించారు. దేశంలో రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీతో పాలు పలు పార్టీలు ఉన్నా.. ఒక పార్టీ వ్యవస్థ కొనసాగుతోందని అభివర్ణిస్తూ, దానిని దీటుగా ఎదుర్కొనేందుకు కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, 2024 ప్రెసిడెంట్ ఎన్నికల్లో ట్రంప్ కు కుడిభుజంగా పనిచేసిన మస్క్ టంప్ అడ్మినిస్ట్రేషన్ లో ప్రభుత్వ సమర్థత విభాగం (డిఓజిఇ) అధిపతిగా బాధ్యతలు చేపట్టి ఫెడరల్ వ్యవస్థ ఉద్యోగులను తగ్గించేందుకు రిపబ్లికన్ ప్రయత్నాలకు నాయకత్వం వహించి, ప్రెసిడెంట్ ట్రంప్ తో తీవ్ర విభేదాల వల్లవైట్ హౌస్ కు దూరమయ్యాడు. ముఖ్యంగా, ట్రంప్ తీసుకువచ్చిన బిగ్, బ్యూటిఫుల్ బిల్ విషయంలో ట్రంప్ తో విభేదించి ఆయనకు మస్క్ దూరమయ్యాడు.

ఈ ప్రణాళిక అమెరికారుణాన్ని దెబ్బతీస్తుందని,ఆరోపించిన మస్క్ దీనికి ఓటు వేసిన అమెరికా కాంగ్రెస్ సభ్యులను ఓడించేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. అందుకే అమెరికా పార్టీ ని ప్రారంభించారు. తన లక్ష్యాలను సాధించేందుకు స్వయంగా కొత్త రాజకీయ పార్టీ ని ప్రకటిస్తూ, అమెరికా ప్రజలకు వారు కోల్పోతున్న స్వేచ్ఛ కల్పిస్తానని వాగ్దానం చేస్తున్నారు ప్రస్తుతం ఉన్నది ప్రజాస్వామ్యం కాదని, వ్యర్థమైన, అవినీతితో కూడిన విధానాలతో దేశాన్ని దివాలా పరిస్థితిలోకి తీసుకుపోతున్న ఒకే పార్టీ వ్యవస్థ అని ఎలాన్ మస్క్ విమర్శించారు. శతాబ్దాలుగా అమెరికా రాజకీయాలను శాసిస్తున్న రెండు పార్టీల వ్యవస్థ నుంచి మీరు స్వతంత్రం కోరుతున్నారా అని కోరుతూ నిర్వహించిన పోల్ ఫలితాలను మస్క్ అమెరికా స్వాతంత్ర దినం జూలై 4న అప్ లోడ్ చేశారు. ఆ పోల్ లో 12 లక్షలమంది అమెరికన్ పౌరులు పాల్గొన్నారు. రెండు పార్టీల వ్యవస్థ ఒక పార్టీ వ్యవస్థగా మారిన ఈ తరుణంలో మీరు కొత్త రాజకీయ పార్టీని కోరుతున్నారని, అది మీకు లభిస్తుందని ఎలాన్ మస్క్ ఎక్స్ లోని తన పోస్ట్ లో పేర్కొన్నారు.

మస్క్ పార్టీలో ముగ్గురు అమెరికన్లు.. ట్రంప్ సన్నిహితురాలు లారా లూమర్ అంచనా
కొత్త అమెరికా పార్టీలో ముగ్గురు ప్రముఖ అమెరికన్లు చేరతారని ట్రంప్ స్నేహితురాలు లారా లూమర్ అంచనా వేశారు. వారు టక్కర్ కార్ల్సన్, మార్జోరీ గ్రీన్, థామస్ మాస్సీలు మస్క్ పార్టీలో చేరతారని లారా అభిప్రాయ పడ్డారు. వీరిలో థామస్ మాస్సీ మస్క్ మద్దతుదారు, ట్రంప్ ప్రవేశపెట్టిన బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన ఇద్దరు రిపబ్లికన్‌లలో ఒకరు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News