అమరావతి: తమ్ముడి పెళ్లి రోజున అన్న భార్య కడుపు నొప్పితో చనిపోయింది. పెళ్లింట్లో విషాదం చోటుచేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. కోటపాడు గ్రామంలో మారేశ్వర రావు, జోత్స అనే భార్య భర్తలు నివిస్తున్నాడు. బుధవారం రాత్రి మారేశ్వర రావు సోదరుడు చెన్నారువు పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. బుధవారం మధ్యాహ్నం జోత్స కడుపు నొప్పి ఎక్కువగా ఉండడంతో చింతలపూడిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మం జిల్లాకు తీసుకెళ్లాలని మారేశ్వర్ రావు వైద్యులు సూచించారు. వెంటనే తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన తన భార్యను ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్తున్నానని చెప్పాడు. ఖమ్మంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమె స్కానింగ్ చేశారు.
జ్యోత్స గర్భం దాల్చిందని, గర్భ సంచిలో కాకుండా పేగులో పిండం పెరగడంతో అది పగిలిపోయి రకస్రావమైందని వివరించారు. వెంటనే ఆపరేషన్ చేయకుంటే బతికే అవకాశం లేదని వైద్యులు పేర్కొన్నారు. ఆమె పరస్థితి విషమంగా ఉందని వైద్యులు భర్తకు తెలియజేశారు. వెంటనే ఆపరేషన్ చేస్తుండగా ఆమె చనిపోయింది. మృతురాలి బంధువులు ప్రైవేటు ఆస్పత్రికి చేరుకొని ఆందోళన చేపట్టారు. మృతురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భర్త చేయమంటేనే ఆపరేషన్ చేశామని వైద్య సిబ్బంది తెలిపారు. ఆస్పత్రి యజమాన్యంతో రాజీ కుదరడంతో ఆందోళన విరమించారు.