Monday, May 12, 2025

ప్రధాని నివాసంలో అత్యవసర సమావేశం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi).. ప్రతీ రోజు అత్యవసర సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారం కూడా ఆయన సమావేశం(Emergency Meeting) ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భధ్రత సలహాదారు అజిత్ దోభాల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు పాల్గొన్నారు.

భారత్-పాక్‌ల మధ్య కుదిరి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించడం మొదలైన విషయాల్లో హాట్‌లైన్‌లో నేడు భారత్-పాక్ మధ్య కీలక చర్చలు జరుగనున్న నేపథ్యంలో ఈ భేటీ(Emergency Meeting) ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరుదేశాల ఇరు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలిటరీ ఆపరేషన్స్‌ (డిజిఎంఒ) స్థాయిలో మాట్లాడనున్నారు. నేడు తాజా పరిస్థితులపై విదేశాంగ శాఖ, రక్షణ శాఖ కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News