- Advertisement -
ఆర్.నారాయణ మూర్తి (R. Narayana Murthy) దర్శక నిర్మాత గా రూపొందించిన యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమా ఆగస్టు 22న విడుదల కానుంది. ఈ సినిమా గురించి ప్రముఖ హాస్య నటులు, పద్మశ్రీ బ్రహ్మానందం మాట్లాడుతూ “నారాయణ మూర్తి తేనెటీగ లాంటి మనిషి. అంతటా తేనె పోగుచేసుకొని వచ్చి తలా ఒక చుక్క పంచిపెట్టాలి అనేటటువంటి మహా సంకల్పం ఉన్న మంచి మనిషి. యూనివర్సిటీ సినిమాలో అద్భుతమైన భావోద్వేగం ఉంది. నిజాయితీగా, అద్భుతంగా తీసిన ఈ సినిమాను అందరూ చూడాలి”అని అన్నారు. ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ “యూనివర్సిటీ సినిమా చూసి నన్ను ఆశీర్వదించి నాపై ప్రేమను చూపిస్తున్న (Showing love me) బ్రహ్మానందంకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమాను ఆగస్టు 22న రిలీజ్ చేస్తున్నాను”అని తెలిపారు.
- Advertisement -