Sunday, June 22, 2025

సామాజిక సందేశంతో..

- Advertisement -
- Advertisement -

మొగలి రేకులు ఫేమ్ హీరో ఆర్‌కె సాగర్ నటిస్తున్న ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది 100’.(The 100’) రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రియా ఫిల్మ్ కార్ప్, దమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రమేష్ కరుటూరి, వెంకీ పూశడపు, జె తారక్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శనివారం మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. జూలై 11న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. అలాగే ఈ సినిమా నుంచి హే మేఘలే సాంగ్ ని లాంచ్ చేసి మ్యూజిక్ ప్రమోషన్స్ ని ప్రారంభించారు. ఈ చిత్రంలో ఆర్‌కె సాగర్‌కు జోడీగా మిషా నారంగ్ కథానాయికగా నటిస్తుండగా, ధన్య బాలకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు.

సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో ఆర్కే సాగర్ మాట్లాడుతూ “డిఫరెంట్ కంటెంట్ రావాలని, సామాజిక సందేశం ఉండాలని ఈ కథని ఎంచుకున్నాం. ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమా చేయడం జరిగింది”అని అన్నారు. డైరెక్టర్ శశిధర్ మాట్లాడుతూ “మేఘాలే సాంగ్‌కి హర్షవర్ధన్ రామేశ్వర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇంకా అద్భుతంగా చేశారు. చాలా అద్భుతంగా ఈ పాట రూపొందించాం”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత వెంకీ పూషడపు, రమేష్, జవహర్, ఈశ్వర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News