- Advertisement -
‘కోర్ట్’ చిత్రంతో ఆకట్టుకున్న హర్ష్ రోషన్, శ్రీదేవీ అపల్లా మరోసారి ఓ అందమైన ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ఈ మూవీని రచయిత కోన వెంకట్ తెరపైకి తీసుకు వస్తున్నారు. ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య నిర్మిస్తున్నారు. మ్యాంగో మాస్ మీడియా ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. సంగీతం, ప్రేమ, భావోద్వేగాలు, మనోహరమైన కథతో ఈ మూవీని సతీష్ జవ్వాజీ తెరకెక్కిస్తున్నారు. మేకర్స్ అధికారికంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను టైటిల్ గ్లింప్స్ తో ప్రకటించారు. ఈ చిత్రానికి ‘బ్యాండ్ మేళం’ అని టైటిల్‌ను పెట్టారు. తెలంగాణ యాసలో విజయ్ బుల్గానిన్ స్వరపరిచిన అందమైన ఓ జానపద గీతంతో గ్లింప్స్ ప్రారంభమైంది. ఆస్కార్ అవార్డు గ్రహీత అయిన గీత రచయిత చంద్రబోస్ ఈ చిత్రానికి సాహిత్యం అందిస్తున్నారు.
Also Read : ఇంటిల్లిపాది కలిసి చూసే మంచి సినిమా
- Advertisement -